కొన్ని

What we think, we become (please don't think you are a superhero and try to fly).
కాలమే అన్నిటికి సమాధానం చెపుతుంది(నువ్వు సమాధానం గురుంచి ఎదురు చూడు)
అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు ( అసలు మొదలు పెట్టకు సమాధానం తెలియక పొతే)
అగ్నికి వాయువు తోడైనట్లు (C.E.O. కి HR Manager దొరికినట్లు)
అడగందే అమ్మ అయినా పెట్టదు(కాని  Microsoft ని అడగకుండా Virus లని తెచ్చి పెడుతుంది!)
అడిగేవాడికి చేప్పేవాడు లోకువ(Blog వ్రాసే వాడికి చదివేవాడు లోకువ )
అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు( క్షమించాలి లాక్కునే వాడికి అరవైఆరు కూరలు)
అతి వినయం ధూర్త లక్షణం ( అందుకే ఎన్నికల ముందు రాజ్కియనయకుడిని ఎప్పుడు Industrialist ని నమ్మకూడదు)
అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు (  డబ్బులేని సేవకుడు ప్రజసేవకుడు డబ్బు వున్న సేవకుడు రాజకీయనాయకుడు)
ఆలూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం( Problem లేదు తప్పు లేదు కాని News మాత్రం వుంది)
ఆరోగ్యమే మహాభాగ్యం ( అదే మన ఆరోగ్యం Doctors యొక్క మహా భాగ్యం)
ఆవు చేలో మేస్తే, దూడ దుగాన/గట్టున మేస్తుందా? (National congress ప్రజల సొమ్ము మేస్తే prades congress ఎడారిలో మేస్తుందా?)
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు ( రాహుల్ గాంధీ కి ఇష్టం లేని సామెత)
ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి( ------- యాత్రకి ------- హడావిడి)
 

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.