రాజు నాయకుడు

రాజు - అనగనగా ఒక చక్రవర్తి, అతనికి సామంతులు, మంత్రులు ప్రధాన మంత్రులు ఇలా ఉండే వారు. రాజును రాజ్యాన్ని కాపాడడానికి సైనికులు. రాజుకు కోపం వస్తే సైనికులు వాళ్ళ వాళ్ళ ప్రతాపం చూపించేవారు. రాజుకు వేరే రాజ్యం మీద ఆశ పడితే సైనికులు వెళ్ళి రాజ్యాన్ని జయించుకొచ్చేవాళ్ళు(కొంత మంది మాత్రం exception), తన రాజ్య ప్రజల కోసం అప్పుడప్పుడు మంచి చేసే వాడు(అంటే నేను చరిత్రలో కొంచం weak).

నాయకుడు - అనగనగా ఒక పోరాటం, దానిని గెలిపించిన వారు ఉండచ్చు ఉండక పోవచ్చు, వారి తరువాతి తరం వాళ్ళు వచ్చి కూర్చుంటారు. అప్పటికే ప్రజలు వాళ్ళకి బానిసలు అయిపోయి ఉన్నారు. ఇక అదే అదును మేక లాగా ఎంత తిన్నా సరిపోదు ఆకలి తీరదు. కొన్నళ్ళకి విసుకు పుట్టి వెరే దేశం వెళ్ళి, తమ బిడ్డలకు అక్కడ చదువు నేర్పిస్తారు, చదువుతో పాటు అక్కడ అవలక్షణాలు నేర్చుకుని వస్తారు. వాళ్ళ బిడ్డలు మళ్ళి వాళ్ళ స్థానలు ఆక్రమిస్తారు(క్షమించాలి మనం ఎక్కిస్తాము), వాళ్ళ నియొజక వర్గం బాగున్నా బాగోపోయినా పక్క వాళ్ళ నియోజక వర్గం మీద పడతారు, అక్కడ వాళ్ళ సంభావన అందినాకా నోరు మూసుకుని పోతారు. ఇక్కడ సైనికులు ఉండరు ప్రభుత్వం నియమించిన body guards లేక పోతే మనమే నియమించుకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళ పని రాజుల కాలంలో ఎమిటో ఇప్పుడూ అదే! కాకపోతే రాజులకు అప్పుడఫ్ఫుడు మనం ప్రజలకోసం ఉన్నాము అనిపిస్తుంటాది వీళ్ళకి ఎమో నాకయితే తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి!!!!!



No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.