నన్ను ప్రతినాయకుడు ఎందుకు అవ్వమంటున్నారురు(In context of films)

కొడుకు: నన్ను ప్రతినాయకుడు ఎందుకు అవ్వమంటున్నారు.
తండ్రి; నాయకుడు ఎప్పుడూ సేవ చేస్తూ ఉండాలి.
కొడుకు: అది చిత్రాలలో కదా.
తండ్రి: నాయనా అది చిత్రం అయినా బయట అయినా నిన్ను నాయకుడిలా చూస్తారు.
కొడుకు: అంటే నేను చెడ్డవాడిని అవుతాను అనా మీ అభిప్రాయం.
తండ్రి: కాదు నాయనా, అన్ని సార్లు మనల్ని నాయకుడు అయితే,Press Media పని పాటలేని Aztak లాంటి channels చూస్తూ ఉంటాయి. అదే ప్రతినాయకుడనుకో ఎవ్వరూ మనల్ని పట్టించుకోరు. వాళ్ళ కోసం మనకి ఇష్టం కాని పని చెయ్యనక్కర్లేదు.
కొడుకు: అయినా సరే నేను ప్రతినాయకుడను కాను, ఎందుకంటే నాయకుడుకి చిత్రానికి కోటి పైగా చిక్కుతుంది.
తండ్రి: నాయనా నాయకుడయితే ఈ క్రిందివన్నీ చెయ్యాలి
౧. నీ చిత్రం గురుంచి ప్రతీ క్షణము నీ అభిమానులకు Twitter లో వ్రాయాలి.
౨. Audio release functions కి వెళ్ళాలి.
౩. సంవత్సరకాలంలో ఒక్కటే చిత్రం చేస్తావు.
కొడుకు : అగండి ఆగండి అంటే ఇక్కడ పది చిత్రాలు చేసే అవకాసాలు వస్తాయా?
తండ్రి: అవును, మొన్న విడుదయిలయిన చిత్రాలన్నీ చూడు, ౩ ప్రతినాయకులు ౧౦ మంది character artists, ౨౦ మంది comedians అవసరం లేక పోయినా ప్రేమ కావాలి చిత్రంలో నాగబాబు, జయసుధ అలాగ ఉంటు ఉంటారు. నీకు కధతో సంభందం లేదు అదంతా నిర్మాత, దర్సకుడు ముఖ్యంగా నాయకుడి పని.
కొడుకు : అదెమిటి రచయిత.
తండ్రి: వాళ్ళు నామ మాత్రం, ఎప్పుడయినా అలోచించావా ౩ పేజీల కధలో ౩ గంటల చిత్రం ఎలా వస్తుందో?
కొడుకు: సరేగాని చిత్రానికి ఎంత ముడుతుంది?
తండ్రి: నాకు సరిగ్గా తెలియదు కానీ ఒక ౧౦ నుంచి ౧౫ లక్షలు పైనే.
కొడుకు: అంటే నెను నటించినా నటించక పోయినా?
తండ్రి: అంతే నాయనా.
కొడుకు: సరే నీ ఇషటం
తండ్రి: తెరపైన ప్రతినాయకుడవు అయినా ప్రపంచంలో ప్రతినాయకుడవుకాకు, మంచి చెడులు చిత్రాలలో ప్రేక్షకులు చూస్తారు, ఇక్కడ పైవాడు చూస్తాడు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.