ఎవరయినా పంటలు వెయ్యడానికి కూడా Advertisements ఇస్తే బాగుంటాది

వెంకటరావు : ఎమిటి సుబ్బారావు నీ భాధ
సుబ్బారావు : ఏమీ లేదు ఎవరయినా పంటలు వేయడానికి కూడా Ad's ఇస్తే బాగుంటాది అనిపిస్తుంది.
వెంకటరావు : అర్ధం కాలేదు
సుబ్బారావు : చూడు అసలే diesel ధరలు petrol ధరలు ఆకాసాన్ని అంటుతుంటే ఇంకొక వార్తా channel అంట........
వెంకటరావు : రెండిటికి పొంతన ఏమిటి.
సుబ్బారావు : ఎమీ లేదు నా బాధ అంతా ఒక్కటే, Channels కి కావలిసినది డబ్బు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, Ad's వల్ల,
వెంకటరావు : ఇంకా confusion ఎక్కువయ్యింది
సుబ్బారావు : వెంకీ అర్ధం చేసుకో అందరూ సాగు భూములని బీడు భూములని చూపించి ఇళ్ళు కడుతున్నారు ,SEZ గా మారుస్తున్నారు అదే కనుక ఎవరయినా మీరు వేసిన పంటకి మేము Ad's ఇస్తాము అంటే!!!! కనీసం పర్యావరణం చెడకుండా ఉండేది.
వెంకటరావు : నువ్వు చెప్పింది ఇసుమంతకూడా అర్ధం కాలేదు కానీ నీ బాధ నాకు కొంచం అర్ధం అయ్యింది, ఎంత posh గా కనిపించినా వాడు తినేది అన్నమే, ఎంత ఎత్తున ఉన్నా వాడూ తినేది అన్నమే(అదే ఎవరు ఏది తింటే అదే) కానీ నీ కష్టానికి తగిన ఫలితం దక్కట్లేదు అనే కదా. అది ఎక్కడా జరగదు. తెలివయిన వాడు తెలివి తక్కువ వాడిని బద్దకస్తుడుని చేసి దోచుకుంటున్నాడు, ధనవంతుడు బీధ వాడిని అలాగే నాయకుడు ప్రజలను, ఇంత జరుగుతున్నా వాడిని ఎదిరించే శక్తి మన దగ్గర లేదు, ఒకవేళ ఎదిరించినా lokpal bill లాగానే ఉంటుంది. మారల్సింది మనం. నీతిగా బ్రతుకు నీతిగా చావు, ఎప్పుడూ వీడు ఎందుకు పుట్టాడు అని అనిపించనివ్వకు ..........

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.