ప్రతీ రోజూ పక్కవాడిని వెక్కిరించడమేనా?

అందరికీ ఇదే అనుమానం,

మీరు నమ్మచ్చు నమ్మక పోవచ్చు నా Blog లో నేను వ్రాసిన ప్రతీదానికి నేను అలోచిస్తున్న విధానమే

కొన్ని సార్లు నేను congress ని తిడతానువ(కాదు అన్ని మార్లూ) ఎందుకంటే నాలో ఒక విధమయిన అభిప్రాయం నాటుకు పోయింది, congress లో ఉన్న వాళ్ళంతా అవినీతి పరులు అని.

కొన్ని సార్లు ప్రజారాజ్యం మీద కోపం ఎందుకంటే, అవినీతి కేంద్ర బిందువుతో చెట్టా పట్టలు వేసుకుంటున్నందుకు.

కొన్ని మార్లు చంద్రబాబు అంటే పడదు. రైతులు crop holiday ప్రకటించిన ఇన్ని రోజులకు ఆయన వెళ్ళారు.

ఇక CPI CPM చెప్పక్కర్లేదు వాళ్ళు ఎవరికోసం పోరాడుతున్నారో వాళ్ళకే తెలియదు.

ఇక ఇవి పక్కన పెడితే కుప్పలు తెప్పలుగా పడుతున్న చిన్నా చితకా parties, ఎవడయినా మనకు వ్యతిరేకమా అయితే కొత్త party పెట్టు వెనకాలే మన media ఉందిగ.

ఇక ఇవి పక్కన పెడితే నాకు కొత్త విషయాలు తెలుసుకోవాలి అని ఆత్రుత, డబ్బు సంపాదించాలి అని లక్ష్యం.

నా గమ్యం నాకే తెలియక సతమతమవుతుంటే పక్కనే ఎవడో వచ్చి ఏదో చెత్త కబుర్లు.

అందుకే నా Blog కి గమ్యం తెలియని బాటసారి కి తేడాలేదు........