మనలో మనం కొట్టు కోవడం అవకాశాన్ని ఇంకొకడు తన్నుకు పోవడం పరిపాటే

ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా,

మన వాడిని తక్కువ చేస్తూ చూపించే కోణం 

చదివారు కదా. 

వాళ్ళు కూడా ఆ తమిళ తంబిలకు మద్దతు.

వీళ్ళకు పరిపాటి అయిపొయింది. ఎక్కడ పడితే అక్కడ మన వాళ్ళని అణగదొక్కాలని వ్రాస్తున్నట్టు ఉంది.

పైగా ముగ్గురూ ఒక్క Heroine అని గొప్పగా కూడా వ్రాసేసాడు మన కర్మ, అయినా రామ్ ని అనాలి వెళ్ళి వెళ్ళి ఆ తమిళ వాడితో పెట్టుకున్నందుకు. మొన్నటి వరకు హిందీ అంటే అది మన భాష కాదు అని ఇప్పుడు అక్కడ వస్తున్న డబ్బులకు కక్క్రుత్తి పడి అక్కడ చిత్రం తీస్తున్న వాళ్ళతో చెయ్యడానికి ఒప్పుకున్నందుకు.

తెలుగు చిత్ర కళాకారులారా తెలుగు చిత్రం తెలుగు వారి కోసం తీస్తున్నారు అని గుర్తుంచుకోండి, తెలుగు వారిని ప్రోత్సహించండి.

అప్పుడు నిరుద్యోగం పెరగదు....
మంచి చిత్రం మేము ఎప్పడూ ఆదరిస్తాం అని గుర్తుంచుకోండి.