ఇప్పటికి దోచుకుపోతున్న సంపద చాలు ఇంకా ఎక్కువ వద్దు

Oppose foreign super markets or hyper markets.

ఎందుకంటే వాళ్ళు అక్కడ తయారయ్యిన సరుకులు తెచ్చి ఇక్కడ అమ్ముతారు. వాటినే మంచివి అని చూపిస్తారు. గాంధీ గారు చేసిన ఉప్పు సత్యాగ్రహం మళ్ళీ చెయ్యాల్సిన పని రానివ్వద్దు.

అదేంటి అలా అంటావు, ఉప్పు సత్యాగ్రహం చెయ్యడానికి కారణం ఉప్పు మీద పన్ను కట్టడం, అది వేరే దేశస్తుల జల్సాలకి దుబారా ఖర్చులకు ఉపయోగ పడుతుంది. ఇప్పుడూ అంతే మన డబ్బులతో వాళ్ళ దేశం బాగుపడుతుంది. ఎలాగంటే వాడికి ఇక్కడ లాభాలు వచ్చినంత కాలం ఇక్కడ వ్యాపారం చేసి డబ్బులు తీసుకుని వెళ్ళి వాళ్ళ దేశం లో దాచుకుంటారు. నష్టాలు వస్తే మూసేసి వెళ్ళి పోతారు. ఇదొక్కటే కాదు మన పంటల మీద మొట్ట మొదటి దండయాత్ర, ఎలా గంటే ఇప్పుడు Americans పరిస్థితిలాగా. మనల్ని వాళ్ళలాగా తయారు చెయ్యడానికి వాళ్ళ ప్రయత్నం.

ఇప్పటికే మన ఆర్ధిక వ్యవస్థని దెబ్బతీసారు, ఇంకా ఇలాంటివి జరిగితే ఇక మనకు వేసుకోవడానికి పంట, పని చెయ్యడానికి నేర్పు ఉన్న కూలీలు దొరకరు.

వీటికి చక్కటి ఉదాహరణలు చేనేత కార్మికులు. ఇప్పటికే వాళ్ళు కనుమరుగయిపోతున్నారు.