ఎనిమిది తలుపులు నాల్గవ భాగం

రావల్ నడిపించిన Money Exchange నాకే Mind తిరిగిపోయింది.
ఎవ్వరికీ అనుమానం రాకుండా Shares ఉపయోగించేవాడు. ఆ విధానాలతో నాకు దిమ్మ తిరిగిపోయింది.
మచ్చుకు కొన్ని,
ఆ రోజు ఎవరైనా విన్నీకి లంచం ఇవ్వాలి అంటే మీ రావల్ వెళ్ళి ఒక వస్తువు ఉదాహరణకు Sports car దాని ధర అక్షరాలా ౨౫ లక్షలు పై చిలుకే అప్పు తీసుకుని కొనేవాడు దాన్ని తీర్చేది మాత్రం లంచం ఇవ్వాల్సిన వాళ్ళు. దాన్ని మళ్ళీ ఆ show room లోనే అమ్మకానికి పెట్టేవాడు. ఉపయోగించలేదు కాబట్టి దాని ధర బాగానే పలికేది దరిదాపు ౨౦ లక్షలు వచ్చేది. 
అలాగే Stock Market ని కూడా ఉపయోగించుకునే వాడు. డబ్బు రావాల్సిన రోజు కొన్ని Shares కొని వాటిని లంచం ఇవ్వాల్సిన వాళ్ళకి అమ్ముతాడు. ఇది అందరూ చేసే పనే కదా అనుకోకు ఆ Company ఉన్నట్టు సృష్టించి అది Stock Exchange లో Place చేసి దాని ద్వారా ఇలా డబ్బును సృష్టించే వాడు. 

ఇదంతా రావల్ శక్తికి మించిన పని, చాలా పెద్ద Network ఉండాలి అనుకునే వాడిని. 
అన్నీ అనుకున్నట్టే సాగి పోవు కదా. రావల్, విన్నీ వెనకాలా ఇంకా పెద్ద Black Mass ఉంది అని తెలిసింది. ఇలా జరుగుతుండగా నువ్వు పుట్టావు. 

చెడు తో పాటే దాన్ని ఎదురించే శక్తి పెరుగుతుంది అందుకే విన్నీ రావల్ కలిసి ఎనిమిది గోడలు కట్టించారు. అందులో నా పాత్ర కూడా ఉంది. ఏమి చెయ్యగలను ఎంతయినా చెడ్డ వాళ్లతో ఉంటె చెడ్డవాడు అనుకుంటారు గానీ మంచివాడు అనుకుంటారా ఏమి.

నువ్వుమాత్రమే ఆ ఎనిమిది తలుపులు దాటి రాగలవు అని నాకు బాగా తెలుసు, కాదు తెలిసింది. జ్యోతిష్యం కాదు ఏదీ కాదు. 

దాని గురుంచి నెమ్మదిగా చెబుతాను.......
అన్నట్టు మరచిపోయాను నీకు ఈ DVD ఇచ్చిన వాడు నీ మరిది అర్జున్, అతని చెల్లెలు కావేరి నే నువ్వు ప్రేమించి పెళ్ళి చేసుకున్నాది.
(ఇంకా ఉంది...)