ఎనిమిది తలుపులు ఆరవ భాగం

ఆ mail పంపినవారెవరో చూడకుండా Delete చేసేసాను. ఆ రోజు రాత్రంతా నిద్రలేదు, నిన్ను కాపాడడానికి నిద్రకూడా పోలేదు.
ఆ తేదీ - 19 -08 - 2014. కానీ నాకు నిద్రలేకుండా చేసింది ఎవరు అనా ఆలోచించాను. నాకు వ్యతిరేకంగా ఎవరు ఉంటారు. అప్పుడు గుర్తుకు వచ్చింది ప్రణతి. ఇదంతా తనే చేసిందేమో అనే అనుమానం వచ్చింది. నాకున్న పూర్వ అనుభవంతో ఆమె Mail ID hack చేసాను కానీ ప్రయోజనం లేదు. అప్పటికే Delete చేసేసిందనుకుంటా! :{

ఆ రోజు నుంచీ ఆమె మీద ఒక నిఘా పెట్టాను. రోజూ అమె చేస్తున్న పనులు ఆమెను గమనిస్తూ ఉన్నాను. అప్పుడు నా Dairy లో మూడు రోజులు కనిపించకుండా పోయాయి. నాకు గుర్తున్నంత వరకు అది ౦౫/౧౧/౨౦౧౪ నుంచీ ౦౮/౧౧/౨౦౧౪ వరకు..

ఆ మూడు రోజుల్లో నలుగురు చనిపోయారు. ఆ నేరలన్నీ నామీదే నాకు తెలియదు అంటే వినరు. వాళ్ళకి ఆధారాలు దొరకలేదు, నన్ను మాత్రం చాలా చిత్ర వధ పెట్టారు. అక్కడి నుంచీ నాన్ను ప్రణతి నన్ను ఇంటికి తీసుకు వెళ్ళింది. అప్పుడు నా భార్య విన్నీ కూడా ఇంట్లో లేదు. తను వేరే పని మీద విదేశాలకు వెళ్ళింది. నేను బయట పడింది ౨౬/౧౧/౨౦౧౪. తను నిన్ను కూడా బాగా చూసుకుంది.

దాంతో నేను కాలు జారాను, ఇక తప్పక పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది, నువ్వు కూడా తనే నీ తల్లి అనుకునేవాడివి. తన దగ్గరే పెరిగావనుకుంట. ఒక రోజు నా రెండవ పెళ్ళి తెలిసి విన్నీ ప్రణతిని చంపించడానికి ప్రయత్నించింది. తను తప్పించుకోగలిగింది. అప్పటికే తను గర్బవతి. మా నాన్నగారి దగ్గరి పంపించేసాను. తరువాత వళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారో తెలియదు. కానీ వాళ్ళే నాకు call చేసే వారు.

ప్రణతికి ౦౨/౧౨/౨౦౧౫(02/12/2015) నాడు Twins పుట్టారు. వాళ్ళ పేర్లు సంజయ్, విజయ్. కొన్నాళ్ళు వాళ్ళను పెంచి తరువాత ప్రణతి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు వాళ్ళ లాలనా పాలన మీ తాత ప్రకాషు చూసుకున్నారు.

తరువాత జరుగుతున్న పరిమాణాలతో నాకు నిన్ను పెంచడం కుదరదు అనుకునే వాడిని. తరువాత ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. నిన్ను దరిదాపు నీ యొక్క పదిహేనవయేట కోల్పోయాము. తరువాత తెలిసింది నువ్వు మీ తాత దగ్గరకి చేరుకున్నావు. అదేలా జరిగిందో తెలియదు కానీ నువ్వు అక్కడికి చేరుకున్నావు.

నిన్ను కోల్పోయింది మేము - ౧౮/౦౪/౨౦౨౬.

మరి మీ మావయ్య పెళ్ళి కూడా అయ్యింది. మీ మామయ్య భార్య పేరు నిషా. నీ మావయ్య పెళ్ళి జరిగింది దరిదాపు ౨౦/౦౪/౨౦౧౪.

అదొక కధ, వాళ్ళ పెళ్ళి చాలా విచిత్రం..
(ఇంకా ఉంది ...)
కొత్త పాత్రలు -
నిషా (రావల్ భార్య)
సంజయ్ విజయ్  (భరత్ తమ్ముళ్ళు )
ప్రకాషు (గగన్ కుమార్ తండ్రి).