ఎనిమిది తలుపులు ఎనిమిదవ భాగం

అన్నట్టు చెప్పడం మరచాను, నీ మరిది అర్జున్ తండ్రిని ఎవరో చంపేసారు తేదీ సరిగ్గ తెలియదు కానీ అర్జున్ ఒక రోజు నన్ను చంపడానికి వచ్చాడు నేనే చంపాను అని, కానీ ఏలాగో బయట పడ్డాను జనవరి ౨౦౨౫(2025) నుంచీ తనుకూడా నీతో పెరిగాడు. మరి అతని చెల్లెలు ఎక్కడ ఉంది అది కూడా నాకు తెలియదు. నీకు అనుమానం వచ్చే ఉంటుంది నిషా రావల్ పెళ్ళి జరిగింది ౨౦౧౪(2014) లో జరిగింది కానీ వాళ్ళు పుట్టింది ౨౦౧౨(2012) లో, మీ మావయ్యకి ౩/౪ ఏళ్ళుగా పరిచయం ఉంది, అప్పుడు వాళ్ళు పుట్టారు. ఇక తప్పక పెళ్ళి చేయించింది విన్నీ. అంతా విన్నీ అనుకున్నట్టే జరుగుతుంది.

కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, రోజూ ప్రణతి ఇంటికి వెళ్ళి ఆమే ఉందా అని చూసే వాడిని ఒక రోజు ఫిబ్రవరి ౨౦౨౬(2026) నన్ను చంపడానికి మొదటి ద్వారం కాపలా దారుడు ప్రయత్నించాడు. ఎందుకో నాకు తెలియదు. నన్ను అక్కడ కాపాడించి ప్రణతి. అసలు ఎందుకు నా జీవితంలోకి వచ్చావు అని అడిగాను. తను చెప్పిన ఒకే సమాధానం నువ్వు ఎప్పటికీ తెరవని తలుపు తెరు అని....... అన్ని సమాధానాలు నీకే దొరుకుతాయి అని.

నిజమే అది నెనుండే సామ్రాజ్యమే కానీ నేను అక్కడ ఒక Research room తెరవలేదు అని గుర్తుకుచేసింది. ఎప్పుడు ఆ గది తెరవడానికి ప్రయత్నించినా నన్ను అడ్డుకునే వారే.

ఇదంతా ఒక confusion అయితే రావల్ చనిపోయాడో లేదో అర్ధం కాలేదు, రోజూ అతనితో మాట్లాడే వాడిని. మరి అర్జున్ నేను చంపాను అని ఎందుకు అన్నాడో తెలియదు.
ఇంకో పక్క ఈ సామ్రాజ్యం లోకి కొత్త కొత్త విధానాలు చేరుతున్నాయి.

ఇంకొన్ని చెడు మార్గాలు,
ప్రతీ రోజు దేశ విదేశాలకు వెళ్ళే వాళ్ళలో ఈ రోజే అతని ఆఖరి రోజు అని Brain Wash చేసి Airport లో కొంత confusion create చేసి Customs నుంచీ చాలా Antiques ని మన దేశం నుంచీ బయటకి తరలించే వాళ్ళు. ఇదంతా ఎవరో ఒకరి ఆలోచనలు, ఇంకొకరి ఆచరణలు. ఇలా పెరుగుతూ పోతున్నాయి October 2039 నాడు వెళ్ళడానికి దారులు వెతకడం మొదలు పెట్టాను. నాకు సహాయం చేస్తున్న వ్యక్తి నుంచీ ఒక parcel వచ్చింది, దానిలో ఒక injection ఒక ఉత్తరం ఎలా వెళ్ళాలో ఉంది.. పంపిన వారు ఈ injection ఇప్పుడే తీసుకో అని కూడా వ్రాసారు..
(ఇంకా ఉంది...)