ఎనిమిది తలుపులు తొమ్మిదవ భాగం

Injection inject చేసుకున్న రోజు ౨౪/౧౦/౨౦౩౯(24/10/2039). నాకు వచ్చిన ఉత్తరంలో ఉన్న సందేశం Coded చెయ్యబడి ఉంది. ఆ రోజు దసరా,౨౬/౧౦/౨౦౩౯(26/10/2039), అందరూ దశమి పూజాలలో నిమగ్నమయ్యారు. నేను తెల్లవారు జామునే పూర్తి చేసుకున్నాను, Injection తీసుకోవడం వల్లో వేరే కారణం వల్లో నిద్రలేదు, శక్తికి కొదవలేదు.ఆ రోజు దుర్గా దేవికి పూజించి ఆ సందేశం Decode చేసి ఆ రోజు నేను మొట్టమొదటి తలుపు తెరిచాను.
తెరిచిన  విధానం కావాలి అంటే చూడు లేకపోతే Next కి వెళ్ళు.


ఆ ఉత్తరం లో ఉన్నసందేశం
౧. భరత్ కనిపించని రోజు?
౨. భరత్ తల్లిదండ్రుల పేరులో మొదటి అక్షరాలూ?
౩. నీ అత్తమామలను చంపింది ఎవరు?
౪. ఈ తెలుపు తెరిస్తే లోపలి వెళతావా?

మొదటి  దానికి రెండవ దానికి సమాధానం తెలుసు, ౩ మరియు ౪ సమాధానం తెలియదు. ఎంత ప్రయత్నించినా తెలియలేదు, మహర్నవమి నాడు ప్రణతి నాకు ఒక దస్త్రం అందించింది, అందులో నా మీద తను చేసిన investigation details, తనకు కూడా కొంత వరకే తెలుసు. ౩వ ప్రశ్నకు సమాధానం అక్కడ దొరికింది.
౩ - కి సమాధానం నేను,
౪ ప్రశ్నకు సమాధానం - వెళ్ళను.

ఇక్కడ చిక్కు ప్రశ్న నేను మా అత్తా మామలను చంపానా?