ఎనిమిది తలుపులు పందొమ్మిదవ భాగం

మరి ఆ రక్షకభటుడు వ్రాసిన FIR లో నా పేరు మంత్రి పేరు తారుమారు చేసి నాదగ్గర సంతకం తీసుకోవడానికి వచ్చాడు.
ప్రతీ ఒక్క Reservation చేసే వారికి తగినంత ముట్టడంతో వాళ్ళు, నా పేరు రాకుండా, మంత్రిపేరు చెప్పి వాళ్ళు శిక్షనుంచీ తప్పించుకున్నారు. మరి ఇప్పుడు తీసుకున్న Tickets అన్నీ మంత్రి ఇంట్లో దొరకడంతో, మంత్రిని Jail కి పంపించారు.

మరి ఈ రశీదుల మాట అవన్నీ Cancel చేసేసారు.

ఇప్పుడు మిగిలిన మంత్రులు ఎందుకు వచ్చారు? నాతో ఏమిటి పని?
ఒకరు రవాణా శాఖామంత్రి, ఒకరు భారీ పరిశ్రమల మంత్రి, ఒకరు నీటి పారుదలా మంత్రి.

వాళ్ళందరికీ ఒక్కటే కావాలి వారి వాటా. మరి చెల్లించాలి కదా!
కానీ ఇదొక్కటే కాదు వాళ్ళకి ఇంకా ఏవో కావాలి..
ఏమిటది..

మళ్ళీ నా దగ్గర ఉన్న యంత్రం శక్తి అయిపోయింది..
అడ్డంగా దొరికి పోయాను అనుకున్నాను. ఇంతలో నా శ్రీమతి వచ్చి, అందరితోనూ మాట్లాడటం మొదలు పెట్టింది. బతికి పోయాను.

మళ్ళీ వెళ్ళి దీని శక్తి పెంచడానికి శక్తి కేంద్రంలో పెట్టాను. ఈలోగా నాకు నేను ఏమైనా Mail పంపానోలేదో చూసుకొన్నాను.

అప్పుడు. నాకు మూడు Mails కనిపించాయి.
మొదటిది ప్రణతి దగ్గరనుంచీ పారిపో నిన్ను Arrest చెయ్యడానికి CBI 19-11-2039 నాడు వస్తారు అని.

రెండవది నీ దగ్గర నుంచీ, అదే నువ్వు తాత కలిసి స్థాపించిన university కి Grants లభించాయి అని.

మూడవది - నీ భార్యను నేను ఇక్కడకి తీసుకు రావాలి అని, అర్ధం కాలేదు. దానికి కావలిసిన అక్షాంశ రేఖాంశాలు నాకు పంపబడ్డాయి.

(సశేషం..)