ఎనిమిది తలుపులు ఏడవ భాగం

ఇప్పటికే చాలా scams చేసేసాము. ఇంకా scams పెరుగుతూనే ఉన్నాయి.
ఇప్పుడు నేను చెబుతున్నది అతి పెద్ద Gas Scam.

ఇది ముందెన్నడూ కనీ వినీ ఎరుగని Scam. దీనికి సూత్రదారి ఎవరు అన్న విషయం గురించే అన్వేషిస్తున్నాను. అది తెలిసిన తరువాత నీకు తెలియజేస్తాను. అన్నట్టు నీకు చెప్పడం మరిచాను నేను ఈ వీడియో తయారు చెయ్యడం మొదలు పెట్టడానికి కారణం నాకు వచ్చిన Mail.

అందులో సమాచారం, ఈ రోజు మొదలు పెట్టు లేక పొతే అవ్వదు అని. అది వచ్చిన తేదీ ౧౫/౦౬/౨౦౩౫(15/06/2034).

ఇప్పుడు నీక ఆ Gas scandal గురుంచి చెబుతాను, నా(అదే నేను ఉండే) సామ్రాజ్యం విస్తరిస్తూనే ఉంది. ఇప్పుడు విన్నీ చెప్పినట్టే అన్నీ చెయ్యాలి అన్నట్టు ఉంది ప్రభుత్వం. ఒక రోజు విన్నీ చెవిన గోదావరి కృష్ణా Basin లో Gas నిక్షేపాలు ఉన్నారీ అని తెలిసింది. మరి దక్కించుకోవాలి ఎలాగా. అప్పుడు విన్నీ ఒక్కో MP చేసిన scams గురించీ తన TV Channel లో ప్రసారం చెయ్యడం మొదలు పెట్టింది అప్పటికే ఆ వార్తా channel అన్ని భాషలలో ఉంది.

మొదటి  రోజు ప్రసారం చెయ్యడం, వాడు విన్నీ చెప్పినట్టు చేస్తే వాడి గురంచి మానేసి వేరే వాడి గురుంచి, మన ప్రజలు అంతే కదా, వెళ్ళి న్యాయస్తానాలు ఆశ్రయించడం మానేశారు వాళ్లు తప్పించుకునే వారు ఇక్కడ పనులు చక చకా సాగిపోయేవి. నెమ్మదిగా నిక్షేపాలు దొరికిన ప్రదేశం నుంచీ GAIL తప్పుకుంది అక్కడ దొరకట్లేదు అనో తియ్యడం చాలా ఖర్చుతో కూడుకుంది అనో.

ఒక రకంగా చెప్పాలి అంటే విన్నీ ఇంచుమించు అందరికీ అధికారి, కానీ ఇది విన్నీ చెయ్యట్లేదు ఎవరో చేస్తున్నారు అని.

అక్కడ దొరికిన నిక్షేపాలు ఒక barrel తియ్యడానికి అయ్యే ఖర్చు 15$, దాన్ని శుద్ది చెయ్యడానికి ఇంకో 10 $, కానీ అమ్మే ధర అక్షరాలా 135$ లు.2 barrel's నుంచీ ఒక barrel శుద్ది చెయ్యబడ్డ Gas వచ్చేది.

పైగా మన దేశంలో దొరికిన ఈ ఇంధనం విదేశాలకు అమ్మి సొమ్ము చేసుకునే వాళ్ళం. అంతే కాదు ఇక్కడ ధర పెరిగితే ఇక్కడే అమ్మే వాళ్ళం.

ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉన్నాయి. అసలు నీ భార్యను ఎందుకు Kidnap చేసాను అన్నదాని గురించి తరువాత చెబుతాను. ఇప్పుడు నిజాలు చాలా బయటకు వస్తున్నాయి.
ఇది Record చేసిన తేదీ ౧౯/౦౬/౨౦౩౪(19/06/2034).
(ఇంకా ఉంది......)
Related to Gas Scam ..........