వరుణుడితో కాసేపు...

ఓం
నేను: ఏమయ్య వరుణదేవా ఎందుకు మమ్ములను కరుణించట్లేదు
దేవుడు: అంటే.
నేను: వర్షాలు పడలేదు పంటలు పండలేదు ఇలాగైతే మా మనుగడ ప్రశ్నార్ధకమే.
దేవుడు: నేను అందుకే బాధ పడుతున్నాను.
నేను: నేను చదివిన దాని ప్రకారం నువ్వు బాధ పడితే వర్షాలు పడతాయి అని, మరి ఇలా ఎందుకు జరుగుతుంది.
దేవుడు: అది ఒకప్పుడు, మరి ఇప్పుడు నా కన్నీళ్లు ఎండిపోయాయి, ఆనంద బాష్పాలు మాత్రమే మిగిలాయి.
నేను: అర్ధం కాలేదు అసలే మంద బుద్దిని.
దేవుడు: ఒకప్పుడు కన్నీళ్ళు బాధగా ఉన్నప్పుడు వచ్చేవి, ఇప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు వస్తాయి.
నేను: మరి మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు.
దేవుడు: మీరు ప్రకృతిని ప్రేమించినప్పుడు, మీరు ఆనందంగా ఉన్నప్పుడు.
నేను: ఎవరు చెప్పారు మేము ఆనందంగా లేము అని, ఎవరు చెప్పారు మేము ప్రకృతిని ప్రేమించట్లేదు అని.
దేవుడు: మరి చెట్లు నరుకుతున్నది ఎవరు.
నేను: అంటే అది అది అయినా నేను నా గురుంచి చెప్పగలను గానీ ఇంకొకరి గురుంచి ఎలా చెప్పగలను.
దేవుడు: నేను చెబుతాను విను, ఏదో మందుకోసం ఎర్ర చందనం చెట్లు నరుక్కుంటూ పోతున్నారు, మీరు ఉదయాన్నే చదువుతున్న అబద్దలకోసం పుట్టిన సాక్ష్యాన్ని నిజం చెప్పలేక ఈనాడు వీటికోసం నరుకుతున్న చెట్లు, ఇలా ప్రకృతిని గాయ పరుస్తూ మీరు ఎలా ఆనందంగా ఉన్నారు.
నేను: అలా అంటావేమిటి అయినా నేను చదివేది ఎక్కువ మసాలా ఉండే Times of India. నువ్వన్నట్టు అవి మమ్మల్ని అందంగా ఉంచడానికే కదా.
దేవుడు: ఎప్పుడైనా ఒకసారి ఆలోచించావా ఒక వెన్నెల రాత్రి మీ సపరివారంతో కలిసి చుట్టూ పచ్చని చెట్లు ఒక పక్క గోదారమ్మ పరవళ్ళు ఉన్న ప్రదేశానికి వెళ్ళావా?
నేను: ఎందుకు వెళ్ళలేదు మాకోసం club Mahidra, Countryclub, AP tourism ఇలా చాలా ఉన్నాయి కదా.
దేవుడు: అంటే నీకు నువ్వు గా వెళ్ళలేదు.
నేను: అర్ధంకాలేదు.
దేవుడు: నీకు నువ్వుగా అంటే నువ్వు ఆ ప్రదేశాలలో తిరిగి అనువైన చోటు కోసం చూడలేదు.
నేను: అది ఎలా కుదురుతుంది, మాకు ఖాళీ లేదు. అయినా అక్కడకి వెళితే రోగాలు రోచ్చులు రావేమిటి.
దేవుడు: ఇప్పుడే అన్నావు నువ్వు ఆనందంగా ఉన్నాను అని అప్పుడే మాట మార్చేసావు.
నేను: అది నేను ఆనందంగా లేను అని ఎలా అంటావు.
దేవుడు: సరే నువ్వు ఆనందంగా ఉన్నావు అనుకుందాము, కానీ ఎప్పుడైనా ఆలోచించావా నువ్వంటున్న Club's నీకోసం అవి తయారు చక్కని ప్రదేశాలు తయారు చేసాయి అని, కానీ నిజం నువ్వు ప్రకృతి ప్రసాదాన్ని నీ దగ్గర సొమ్ముతో అనందిస్తున్నావు.
నేను: నువ్వు ఎప్పుడూ ఇంతే సరే ఇది కాదు నువ్వట్టు ఆ పత్రికల గురుంచి మాట్లాడు కుందాము. వాళ్ళు Paper recycle చేస్తున్నారు కదా.
దేవుడు: ఎంత శాతం అని ఎప్పుడైనా అడిగావా? ఇంకోవిషయం కాగితం Recycle చేస్తే ఎంత కాగితం వస్తుంది, పోనీ సరిపడా వచ్చిందే అనుకుందాము, మరి కాగితాన్ని శుభ్రం చెయ్యడానికి నీళ్ళు ఎక్కడినుంచీ వస్తున్నాయి అని అడిగావా?
నేను: అయ్యబోయ్ నాకు తెలియని వాటి గురించి బేరీజు వేసుకుంటూ ఎలా కూర్చుంటాను.
దేవుడు: ఇప్పటికైనా నమ్ముతావా, నువ్వు ఆనందంగా లేవు అని.
నేను: ఈ రోజుకు వదిలేయ్ రేపు వచ్చి నేను ఆనందంగా ఉన్న విషయాలు చెబుతాను అప్పుడైనా ఆనంద బాష్పాలు నీ దగ్గర నుంచీ వస్తాయేమో చూద్దాం.
దేవుడు: అనవసరమైన సమయంలో అడుగుతున్నావు, అయినా నువ్వు ఆనందంగా ఉన్నాను అని నిరూపించలేవు, నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి. కానీ గుర్తుంచుకో పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు పడకూడదు.
నేను: (దేవుడా )
దేవుడు: చెప్పునాయనా.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.