మరి వారసుడు ఎవరు?

ముంబై: టాటా గ్రూప్ అధినేత టాటా వారసుడిగా సైరస్ పి. మిస్త్రీ ఎంపికయ్యారు. ఎనబై బిలియన్ అమెరికన్ డాలర్ల టాటా సన్స్ హోల్డింగ్ కంపనీ వ్యాపార సామ్రాజ్యానికి సైరస్ పి. మిస్త్రీని వారసుడిగా ఎంపిక చేస్తూ డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆయన ఏడాది పాటు రతన్ టాటాతో కలిసి పనిచేస్తారు. డిసెంబర్ 2012 తర్వాత రతన్ టాటా పదవీ విరమణ చేసిన తర్వాత కంపెనీ పగ్గాలను సైరస్ అందుకుంటారు. 43 ఏళ్ల సైరస్ ప్రస్తుతం షాపూర్జీ పాలోన్‌జీ గ్రూప్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. టాటా సన్స్ హోల్డింగ్స్ షాపూర్జీ పాలోన్‌జీ గ్రూప్‌నకు 18 శాతం వాటా ఉంది. సైరస్‌ను డైరెక్టర్స్ బోర్డు ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్‌గా ఎంపిక చేసింది.

సైరస్‌ను రతన్ టాటా వారసుడిగా ఏకగ్రీవంగా బోర్డు సిఫార్సు చేసిందని టాటా సన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. సైరస్ 2006 ఆగస్టు నుంచి టాటా సన్స్ బోర్డులో ఉన్నారు. ఆయన ప్రమాణాలు, వ్యక్తిత్వం బాగుందని బోర్డు అభిప్రాయపడింది. ఏడాది పాటు సైరస్‌తో పని చేసి, ఆయనకు తగిన విధంగా అనుభవం వచ్చేలా చేసి తాను పదవీ విరమణ చేస్తానని టాటా చెప్పారు. 1968 జులై 4వ తేదీన జన్మించిన సైరస్ లండన్ ఇంపీరియల్ కాలేజీలో బిఇ సివిల్ ఇంజనీరింగ్ చేశారు.

ఇక్కడ పూర్తి వివరాలు

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.