ఎంతకాలం ఎంతకాలం

ఈ రోజు ఎందుకో స్వాతి పుస్తకం చదివుతున్నాను.
ఆమె ఎవరో పెద్దామె నన్ను అడగండి పుట, అందులో ప్రశ్న
మేము కొన్ని సంవత్సరాల క్రితం స్థలం అమ్మాము. అప్పుడు మేము బయట ధర కన్నా తక్కువ ధరకు అమ్మాము. స్థలం Register కాలేదు.
ఇప్పుడు దాని మీద మేము న్యాయస్థానానికి వెళదాము అనుకుంటున్నాము ఏమి చెయ్య మంటారు.
సమాధానం నాకు చిర్రెత్తింది, వెళ్ళండి.
ఆ పుట నేను చదువతాను సమాధానాల కోసం కాదు ప్రశ్నల కోసం ఎందుకంటే మొదటి ప్రశ్నకు సమాధానం చివరి ప్రశ్నకు సమాధానం చాలా తేడాగా ఉంటుంది.
వీళ్ళు సంఘ సంస్కర్తలుగా చలామణీ అవుతున్నారు. ఇలా ఎంత కాలం. పురోగతి ఆగిపోయింది అంటే ఏదో అనుకున్నాను, ఇలాంటి సమాధానాలు మనల్ని విస్మయ పరుస్తాయి. ఆ విస్మయ స్థితిలో మనం మంచి మార్గం ఎన్నుకోలేము. ఏదైనా ఒకదానికి ఉండు అని చెబుదాము అని ఈ టపా వ్రాస్తున్నాను.