నాటకం రసవత్తరంగా చంద్రబాబు ను చిత్తు చేసింది.

సూత్రదారులు
౧. కిరణ్ కుమార్
౨. జగన్
ప్రతి నాయకులు
౧. చంద్రబాబు
హాస్యనటులు
౧. చిరంజీవి.
సాంకేతిక వర్గం
౧. బొత్స - మాటల తూటాలు.
౨. అల్లు అరవింద్ - తెరవెనక పాత్ర.

నటీ నటులు:
చంద్రబాబు తరపు నాయకులు కిరణ్ తరపు నాయకులు (జగన్ తరపు నాయకులు కూడా), చిరంజీవి తరపు నాయకులు.

ప్రత్యేక పాత్ర : జయప్రకాష్ నారాయణ.

పత్రికలు: ఈనాడు, సాక్షి.
కధ:
ఒక రోజు రాత్రి జగన్ నుంచీ కిరణ్ కు phone ఏమిటి అవిశ్వాసం గురుంచి ఏమి చేద్దాం?
కిరణ్:ముందుగా అనుకున్నట్టే కానివ్వు.
జగన్:అంటే మనం చూపించినట్టు ౧౦ మంది మాత్రమే నాతో ఉన్నారు అని చంద్రబాబుకు చూపించి చివరగా నా సంఖ్య బలం ౧౮ కు తెప్పించాలి అంతే కదా.
కిరణ్: అంతే, ఈ లోగా చిరంజీవిని నేను ఆడుకుంటాను.
ఇప్పుడు కిరణ్ చిరంజీవితో
(జగన్ ను conference లో ఉంచి)
చిరంజీవి: ఏమిటి ఇప్పుడు call చేసారు.
కిరణ్: ఎమీ లేదు, అవిశ్వాసం గురుంచి.
చిరంజీవి: హాస్యనటుడి పాత్ర తెలియనిదా ఏమిటి. అయినా నాకు ఈ settlement గుంచి తెలియదు మా బావను తీసుకు వస్తాను.
అల్లు  అరవింద్ కు చిరు అంతా చెప్పి conference లో చేర్చాడు.
అల్లు అరవింద్: అంతా బాగానే ఉంది,మరి వాటా సంగతి.
కిరణ్ చిరంజీవి ని mute చేసి జగన్ తో మాట్లాడాడు.
కిరణ్: మరి వాటా సంగతి.
జగన్: తెలిసిందే కదా, కానీ ఇంకొన్నాళ్ళు వేచి ఉండమని చెప్పు లేకపోతే ఆ ఈనాడు వాళ్ళు ఇప్పటికే తిమ్మిని బమ్మిని చెయ్యడానికి కూర్చున్నారు.
కిరణ్: వాళ్ళా సాక్షినా (మనసులో ), సరే.
చిరంజీవి: ఏమిటి ఎవరితో మాట్లాడు తున్నావు.
కిరణ్: ఇక్కడ బొత్స గారు ఉన్నారు, ఆయనతో.
బొత్స: బాబు చిరజీవి గారు, ఇప్పటికిప్పుడు అంత కష్టం, కొన్నాళ్ళు ఆగండి, మా వాళ్ళు తీసే చిత్రం లో మీ కుటుంబ సబ్యులను పెట్టి బయట వాళ్ళకి అనుమానం రాకుండా ముగించేద్దాం.
చిరంజీవి: బావా నువ్వేమంటావు?
అల్లు: ఏముంది కానీ నా MP పదవి.
చిరంజీవి: అవును మా బావ MP పదవి?
కిరణ్:మళ్ళీ మొదటికి వచ్చాడు(మనసులో), కొన్నాళ్ళు బెట్టు చేసినట్టు కనిపిస్తే మీ మంత్రి పదవి మీకు లభిస్తుంది, మీ బావకు MP seat.
ఆ  రాత్రి జగన్ వాళ్ళ MLA లకు ఒక సందేశం, మీరు నాతొ ఉన్నట్టు చూపండి చాలు. ఈ ఊగిసలాట అవిశ్వాస తీర్మానం ముందు వరకూ మాత్రమే చెయ్యండి.
ఈ పదనిసలు ముగిసాకా, ఒక రాత్రి Assembly లో అవిశ్వాసం పెట్టాడు ప్రతినాయకుడు(చంద్రబాబు).
కిరణ్ కు చంద్రబాబు కు మాటా మాటా పెరిగింది.
చివరకు అవిశ్వాసం లో అందరూ అనుకున్నట్టే వీగిపోయింది.
మిగతా తారాగణం Assembly అన్నాకా కనిపించాలిగా.
ముఖ్య అతిధి గురించా, మరచిపోయాను గత కుంభకోణానికి తోడుగా ఉండాలా ఈ కుంభకోణానికి తోడుగా ఉండాలో తెలియక మధ్యలో ఒక press statement.
దాన్ని పత్రికలు ప్రచురించాయి కదా నేను ఇంకేమి చెప్పేది లేదు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.