గ్రహణం వీడింది (ఎనిమిది తలుపులు - చివరి భాగం)

గగన్: అసలు ఈ FDI bill ప్రవేశ పెట్టడానికి కారణం ఏమిటి?
విన్నీ: అదా, అది మనం దాచుకున్న నల్ల ధనం మీద మనం సుంకం చెల్లిస్తూ వస్తున్నాము ఆ swiss banks లో అదే ఇక్కడైతే లాభం తరువాత దాని మీద పన్ను.
గగన్: మరి దీని గురుంచి తెలుసుకోలేరా?
విన్నీ: వచ్చే దారులు వేరు.
ఆ ధనం విదేశాలలో ఉన్న మన వాళ్ళకు పంపుతావు, వాళ్ళు అక్కడ నుంచీ మనకు డబ్బులు పంపిస్తారు అదే investment. మరి మనకి ఎలా వస్తాయి అనే కదా, దానికీ దారులు ఉన్నాయి.
కొన్ని రోజుల తరువాత company shares value తగ్గించి, అదే వాళ్ళ మధ్య వాళ్ళే అమ్ముకునే వారు, చివరగా వాళ్ళు Share Trading కి చెల్లించిన సొమ్ముతో మనం వాళ్ళకి చెల్లించి పూర్తిగా మన ఆధీనంలో కి తీసుకు వస్తాము, అదే కదా మనం పత్రిక స్థాపించినప్పుడు ఉపయోగించిన విధానం కదా!
ఇలా చాలా తెలుసుకున్న నాకు(గగన్) శిక్ష తప్పదు. అందుకే నాకు నేను శిక్ష విధించుకున్నాను.అదే Nano robots ఉన్న గదిలోకి వెళదామని నిశ్చయించుకున్నాను, అదే మరణ శిక్ష.
మరి ఎవరు ఇక్కడకు రాగలరు?
అందుకే నీ భార్యను ఇక్కడకు తీసుకు వచ్చాను. మరి నాకు నేను సందేశాలు పంపుకున్నాను. నువ్వు ఈ రోజు గ్రహణం (౧౫-౧౨-౨౦౩౯), ఇక్కడకు వచ్చేలా చేసాను.
మరి నువ్వే ఎందుకు?
౮ తలుపులు చాలా తలుపులు మన DNA తో మాత్రమే తెరుచుకుంటాయి. వీటి గురంచి నాకు అనుమానం మొదలయ్యింది ఒకసారి విన్నీ తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తుంటే నువ్వు ఒక ద్వారం తెరిచావు. ఇంకో మారు ఒక Physiological wall దాటావు. దాన్ని నేను ఎప్పుడూ దాటలేక పోయాను.
మరచిపోయాను నిన్ను లోపాలకి రావడానికి సహకరించింది రోహిత్, అతనికి ఇవ్వాల్సింది అతనికి ఇచ్చేయ్.
మీ బావ తీసుకు వచ్చిన Remote recorder సాయంతో నేను లోపలి వెళుతున్నాను.
గగన్: విన్నీ నువ్వెందుకు వస్తున్నావు?
విన్నీ: నువ్వు లేకుండా నేనుండలేను.
 ఆ Nano robots మమ్మల్ని పొడిచాయి.
(గ్రహణం వీడింది)