వీగిపోతున్న జనం యొక్క/కోసం అర్జి(ఎనిమిది తలుపులు ముప్పై ఏడవ భాగం)


ఓం
గగన్: ఇవన్నీ చూస్తూ communist parties ఏమీ అనేవి కాదా?
విన్నీ: వాళ్ళా, వాళ్లకి వాళ్ళ తరువాత తరం, అదే వంసోద్దారకుల ఉన్నత విద్య కి కావాల్సిన డబ్బులు ఇస్తే చాలు.
గగన్: ఇది ప్రజలకు తెలియదా?
విన్నీ: తెలుసు తెలిసినా ఏమి చెయ్యగలరు, వాళ్ళకి ఆరోజు ఉద్యోగం ఉంటే చాలు.
గగన్: అంటే ఇదంతా తెలిసే చేస్తున్నారా?
విన్నీ: ఒక పక్కన న్యాయస్థానాలు పాత pending cases కి judgment ఇవ్వడానికే చాలా సమయం తీసుకుంటున్నారు. ఇక కొత్త వాటికి న్యాయం చేకూరుతుందా చేకూరినా ఎప్పటికి? ఇవే కాదు ఎప్పుడైనా parliament సజావుగా జరిగి మా మీద ఉన్న cases గురుంచి వచ్చేలా ఉంటే ఒక చెత్త అర్జి వేదిక మీదకు వస్తుంది.
అలాంటిదే FDI, శీతా కాల సమావేశాలు ముగిసి పోయాయి!
గగన్: ఏమిటి FDI ఏమిటి?
విన్నీ: దాని గురుంచి చెప్పాలి అంటే చాలా ఉన్నాయి.
దాన్ని ప్రవేశ పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. అది కనుక pass అయిపోతే బాగు పాడేది మనమే కదా.
గగన్: అది ఎలాగా?
విన్నీ: మనకి Uranium Extract చెయ్యడానికి కావాల్సిన సరుకులు దొరికాయి!
గగన్: అయితే, అయినా నువ్వు దానికి దీనికి లంకె వేస్తావేమిటి?
విన్నీ: అదే మరి, కొన్ని విషయాలు, తీగ లాగితే గానీ డొంక దొరకదు.
FDI అర్జి కనుక pass అయితే
౧. అప్పటికే జనాల దగ్గర ఏమీ మిగలలేదు. డబ్బులు లేవు,మన దగ్గర ఉన్న భూములు ఆ FDI కు అమ్మి, చుట్టూ పక్కల స్థలాలు SEZ కింద మార్చి వాటిని ఎక్కువ ధరలకు ఏమ్ముకోవచ్చు.
౨. ఒక సారి జనాలు ఆ Hyper/Super Markets కి అలవాటు పడ్డాక, వాళ్ళు వాళ్ళ దేశాల నుంచీ తెచ్చి మన దేశంలో అమ్మడం మొదలు పెడతారు దానితో, రూపాయి విలువ పడిపోతుంది, Extraction సరుకులు కొనడానికి మనకి Dollars లోనే అమ్మాలి కదా.
౩. నీ దగ్గర swiss banks లో మూలుగుతున్న నల్ల ధనం భారత దేశానికి నీ బినామీల ద్వారా భారత దేశానికి రప్పించి పెట్టుబడులు పెట్టించ వచ్చు, దాన్ని తెల్ల దానంగా మార్చ వచ్చు. అది ఎలాగా మార్చడానికి మీ పధకం ఏమిటంటే, నీ పెట్టుబడి ౩,౦౦,౦౦౦ నీ బినామీలు ౩,౦౦,౦౦,౦౦౦ నీ బినామీలు ఎవరో ఎవరికీ తెలియదు, కాబట్టి ఎందుకు పెట్టుబడి పెట్టారో ఎలా తెలుసుకోగలరు.
౪. ఒక వేళ ఇది pass అవ్వకపోతే ఒక సమావేశ కాలం మనం తప్పించుకోవచ్చు.
గగన్: మరి మన దేశ ప్రజలు నష్టపోతారు కదా!
విన్నీ: ఎవరు?
గగన్:
౧. వ్యవసాయం చేసుకునే వారు, బియ్యం సాగు చేసే వారు, వాటి నుంచీ burgers/pizzas చెయ్యరు కదా!
౨. చేనేత కార్మికులు, వాళ్ళు వాళ్ళు తయారు చేసిన నేత చీరాల మీద Adidas/Nike అని వ్రాయరు కదా!
౩. మిరియాలు, పప్పుదినేసలు సాగు చేసేవారు - వీటిని కూడా burgers/pizzas లో ఉపయోగించరు కదా!
౪. గారెలు ఉండవు కదా, వాటిని Donuts తో Replace చేసేసారా? ఇంకా లేదా?
౫. కొండపల్లి బొమ్మలు వాటిని plastic barbie dolls తో ఇప్పటికే replace చేసేసారు.
విన్నీ: వాళ్ళు నీ ఊరి వారు కదా, మనకు ముఖ్యం మన ఊరు వాల్లూ బాగుండాలి, అలా ఉంటేనే కదా వేరే వాళ్ళు మన ఊరులో elections కు వస్తే కోడి గుడ్లు తమోతాలుతో కొట్టించాలి కదా!
(సశేషం )

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.