Facebook Account delete చెయ్యనా వద్దా?

ఈ మధ్య తెరిస్తే పదే పదే అవి సందేశాలు. చూసి చూసి విసుగుపుట్టింది.
ఎన్ని మార్లు వాడికి చెప్పిన ఫలితం లేకుండా పోయింది.

మొదట కొన్నాళ్ళు బాగానే అనిపించినా, కానీ ఒకే విషయం మీద ఎన్ని మార్లు నవ్వగలము?
విసుగు పుట్టింది.
కానీ ఏమి చెయ్యను దాన్ని తగిలించేసారు జనాలు.
ఆ Facebook వాళ్ళయినా కొంచం మారిస్తే బాగుంటుంది.
ఉదాహరణకు,
ఈ post నేను వ్రాసాను దాన్ని ఇంకొకడు re share చేస్తే మా ఇద్దరి స్నేహితుడి గోడ మీద రెండు వేరు వేరు post లాగా కాకుండా ఒకే post లాగా కనిపించి దానికి మా ఇద్దరి సంభాషణలు జతచేస్తే బాగుంటుంది.
చూసి చూసి కొన్ని videos bore కొడుతున్నాయి. ఒకరు వ్రాసినది చూపించద్దు అంటే ఇంకొకరు దాన్నే మళ్ళీ reshare చేస్తే చూపించే సదుపాయం కూడా తీసేస్తే బాగుంటుంది.

ఇవి జరగక పొతే నేను త్వరలో facebook ఖాతా తొలగించుకుంటాను. లేదా నెలకి ఒకసారి తెరుస్తాను...........

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.