రాము సోము

రాము: కొత్త చిత్రాలు ఏమున్నాయి?
సోము: చాలా ఉన్నాయి!
రాము: ఏ చిత్రం బాగుంది.
సోము: రోజూ వార్తా పత్రికలలో చూడట్లేదా?
రాము: ఏ వార్తా పత్రికలో?
సోము: అదేమిటి అన్ని వార్తా పత్రికలలో మొదటి పుటలో.
రాము: అవి వార్తలు కదరా!
సోము: రెండింటికి పెద్ద తేడా ఏముంది, రోజుకో చిత్రం చూస్తున్నాము, కదా ఇంకేమి కావాలి.
రాము: దాన్ని చిత్రాలతో పోలుస్తావేమిటి?
సోము: మొన్న ఒక చిత్రం విడుదలయ్యింది, మొదటి భాగం అంతా ఒక పాత్ర వెధవ, అన్నీ చెడ్డ అలవాట్లు, మధ్యలో గత గుర్తుకు రావడం, లేదా గతంలోకి వెళ్ళడం తరువాత ఒక పాత్రని రక్షించడం అంతే అది వంద రోజులు, దానికి పత్రికలలో వస్తున్నా వార్త లకు తేడా ఏమిటి?
రాము: దాన్ని దీనితో ఎలాగా పోలుస్తావు?
సోము: మొన్నటి వరకు అన్నీ చెడ్డ పనులు చేసి ఇప్పుడు నేను కాదు నేను రుషిని అని చెప్పుకు తిరిగే వాళ్ళని ఒకళ్ళు పొగడటం ఇంకొక పత్రిక తిట్టడం, ఇంతకన్నా చిత్రాలలో ఏముంటుంది? ఇంకా చెప్పాలి అంటే ఒక హాస్య నటుడుని ఉంచుతారు, ఆ పాత్ర మొదట నేను ఉన్నాను అని తెలియ నివ్వద్దు అంటుంది, తరువాత స్వతంత్రంగా ఉంటాను అంటుంది. కొంచం సమయం గడిచాకా నేను ఇక్కడ ఉండడం కుదరదు వెళ్లి వాళ్ళతో కలుస్తాను అంటుంది, ఎంతైనా హాస్య నటుడు కదా చిత్రంలో ఉన్న పాత్ర మాదిరిగానే ఇక్కడ కూడా, తీసి పక్కన పెట్టేస్తారు.
రాము: నువ్వు మాట్లాడుతున్నది ఎవరి గురుంచో నాకు తెలియదా అనుకుంటున్నావా?
సోము: చ అయితే ఇక్కడ చూడు.... మహేష్ బాబుకు కాంగ్రెసు గాలం ?
రాము: నీతో మాట్లాడడం అనవసరం...

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.