మా కాలంలో పెళ్ళిళ్ళు

నలుగురూ ఒక చోట చేరతారు, ఇంట్లో చుట్టాలు ఇంట బయటా పందిళ్ళు భాజా భజంత్రీలు అబ్బో అబ్బో ఎన్నెన్నో. 
ఇదొక్కటేనా ఇంకా చాలా చాలా. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే పెళ్ళిళ్ళకు కమ్మని రుచికరమైన వంటకాలు..

ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, కానీ మా కాలంలో పెళ్ళిళ్ళు వల్ల చాలా మందికి శ్రమకి తగ్గ ఫలితం లభించేది.
బంధువులలో చాలా మందికి బట్టలు పెట్టడం, ముఖ్యంగా నేత వస్త్రాలు తరువాత పెళ్ళికి వచ్చిన వాళ్ళకి పళ్ళాలు లేదా గలాసులు ఇలా చాలా, ఇక పెళ్ళి కొడుక్కి పెళ్ళి కూతురికి పట్టు బట్టలు. ఇక పెళ్ళిళ్ళు అంటే ఆడవాళ్ళు నగా నట్రా ఇలా ఒకటేమిటి ఎన్నో ఎన్నో ఎన్నెన్నో.

అలాగా మా రోజుల్లో పెళ్ళిళ్ళకు మేము కొంత వరకైనా కంసాలి,కమ్మరి,నేత కార్మికులకు ఉపాది కలిపించే వాళ్ళము మరి మీరు?

అంటారు మన పెద్దలు.

నిజమే మరి మనం, ఈ వేగమైన(నిజంగానా?) ప్రయాణంలో మన బంధువులు ఎవరో తెలియదు? 
అలంకరణకి సమయం ఉండడుగానీ beauty parlour  కి మాత్రం చాలా సమయం, అడ వాళ్ళకు మాత్రమె పరిమితం కాదు.
ఇక బట్టలు పెట్టడం గురించా! అమ్మో పెళ్ళి కొడుకు తీసుకున్న suit వేల అక్షరాలా ౨౫౦౦౦ ఇంకా పెళ్ళి కూతురు అబ్బా ఈ కాలంలో చీరలు కట్టడమే కష్టం అలాంటిది పట్టు చీరా?
ఇక పెళ్ళికి వచ్చే వారి సంగతి చెప్పకనే చెప్పాలి, ఇప్పుడు కొత్తగా స్నేహితుల కట్నం ౧౦% తాగడానికి తందనాలు ఆడటానికి. 
మీరు ఏమంటారు?

అన్నట్టు నేను చెప్పడం మరచి పోయాను మా అన్నయ్య పెళ్ళికి నాకు మూడు(అయిదు అడిగాను - అంటే ఒక్క తమ్ముడినే కదా) రోజులు సెలవు ఇవ్వడానికి కూడా నేను పని చేస్తున్నా కార్యాలయం అంగీకరించట్లేదు :{ పెళ్ళి పనులు చూడాలి అని నాకు మాత్రం ఉండదా ఏమిటి!!!!