ఎందుకు తీసేస్తున్నావు?

ఫణీంద్ర: ఏమి విశ్వనాధు నీ Facebook ని delete చేసేద్దాము అనుకుంటున్నావు ?
విశ్వనాధు: ఏమీలేదురా ఫణి ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని చూడాలి అంటే సమయం దొరకట్లేదు. ఉదాహరణకు నా కార్యాలంలో పనికి సంబంధించిన సమాచారం గురుంచి అన్వేషిద్దము అని ఒకరోజు ఇంట్లో కూర్చుని Laptop లో internet connect చేసాను కొంచం సేపటి తరువాత మన స్నేహితులు ఏమి చేస్తున్నారో చూద్దాము అని facebook తెరిచాను, అంతే వందలు వేలు తాజా స్థితులు !!!!! చూసి చూసి విసుగు పుట్టుంది.
ఫణీంద్ర: దానికే నీ స్నేహితుల స్థితిగతులే కదా, దానికే?
విశ్వనాధు: అది కాదురా నాయనా ఒకడు ఈ చిత్రం బాగుంది అంటాడు, ఇంకొకడు దాన్ని తిరిగి ప్రచురిస్తాడు, ఇంకొకడు దాని మీద తన అభిప్రాయం వ్రాస్తాడు తీరా చూస్తే నేను చదివిన వాటిలో 30% ఇది వరకు చాదివినవే, ఇంకో 20 శాతం వాడు వీడికి స్నేహితుడయ్యాడు ఇంకో ౪౦ శాతం ఒకే బొమ్మ చూసి చూసి విసుగుపుట్టింది, ఇంకో ౧౦ శాతం మనకి పనికి వచ్చేవి!
ఫణీంద్ర: అయితే మాత్రం నువ్వు చాలా కోల్పోతావు, ఉదాహరణకు చాల సంస్థలు facebook ద్వారా login అయ్యే సదుపాయం కల్పిస్తున్నాయి మరి దానికి? 
విశ్వనాధు: అది చాల పాతది openID అనే సంస్థ దాన్ని ఎప్పుడో తీసుకు వచ్చింది. కానీ దాన్ని ఎవరూ ఉపయోగించట్లేదు అంతే.
ఫణీంద్ర: అది పనికి రాదు కాబట్టి దాన్ని ఉపయోగించట్లేదు, అంతే!
విశ్వనాధు: కాదు అన్ని పెద్ద పెద్ద సంస్థలు దాన్ని ఇస్తున్నాయి ఉదాహరణకు నా blog ఒక openID. కానీ ఎందుకు ఉపయోగించట్లేదు అన్నది చాలా చిన్న విషయం మన సంస్థలకు కావలసినది తక్కువలో ఎక్కువ Advertisement , అది దీనితో జరుగుతుంది.
ఫణీంద్ర: ఎలాగా?
విశ్వనాధు: నీకు కావలిసినది login అవ్వడానికి సులభమైన మార్గం, మరి సంస్థలకు నువ్వు dEnni ఎక్కువ అపెక్షిస్తున్నవో అన్న సమాచారం దాని గురుంచి సంస్థలు facebook తో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. నువ్వు ఆ సంస్థను ఆమోదించే మునుపు అన్ని చదివావా లేదు, అవి నీ కీలక సమాచారం కేంద్రికరించుకుని నీకు spam mails పంపుతాయి. ఉదాహరణకు నువ్వు ఎక్కువగా job కి సంబంధించిన విషయాల గురంచి ప్రస్తావించావు అనుకుందాము అప్పుడు నీ యొక్క Mail ID ని ఆ సంస్థలు spam చేసే సంస్థలకు అమ్ముకుంటాయి!
ఇదే కాదు ఇప్పుడు Facebook public issue కి వెళుతుంది అదీ దాదాపు $౧౦౦ billion dollars , అది ఒక రకంగా చెడ్డ నిర్ణయం ఎందుకు అంటే, డబ్బులు ఒకరి దగ్గర కేంద్రీకృతం అయిపోతాయి, ఇప్పటికే wall street లోని ఉద్యోగులు గొడవ పెడుతున్న సంగతి విధితమే కదా అంతే కాకుండా దాని వల్ల కలిగే నష్టం అంటా ఇంతా కాదు, ఇప్పటికే అందరూ ఉద్యోగాలు అంటూ పైనా క్రింద పడుతున్నారు, ఇదే జరిగితే ఒకప్పడి మనుషుల అమ్మకం మళ్ళీ జరుగుతుంది.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.