అధికార రహస్యం ఇప్పుడే బయట పడింది

సుబ్బు: ఏమిరా ఎలా సాగుతుంది నీ ఉద్యోగం?
కోశాధికారి: ఏముందిరా మొన్న పంటలు సరిగ్గా పండలేదు, Lorry లో సరుకు దొంగతనంగా తీసుకు వెళ్ళట్లేదు, దాడులు చేద్దామన్నా ఉదయం అంటా నుంచుంటే ఏమీ లేదు అసలు ఈ నెల అసలు ఏమీ మిగలలేదు!
సుబ్బు: మరి ఏమి చేద్దాము అనుకుంటున్నావు?(మనసులో: నువ్వు ఏదో పెద్దదే అలోచించి ఉంటావు)
కోశాధికారి: ఏమో రా ఇంకా ఏమీ అనుకోలేదు.
సుబ్బు: నేను ఎవరికీ చెప్పనురా, చెప్పరా!
కోశాధికారి: ఏముందిరా ఈ నెలలో రెండు రోజులు కొంచం కష్టపడితే ఇంక నా పంట పండుతుంది.
సుబ్బు: అది ఎలాగా?
కోశాధికారి: ముందే చెప్పేస్తే నువ్వు విషయం అందరికీ తెలిసేలా చేసేస్తావు చెప్పను.
సుబ్బు: చెప్పనురా(మనసులో: అసలు నీ స్నేహితుడుగా ఉన్నదే ఇలాంటి వాటి నుంచీ బయటపడటానికి)
కోశాధికారి: సరే నాకు మొన్న అందిన సమాచారం ప్రకారం మన ప్రాంతంలోకి ౨౦ కోట్లు విలువ చేసే వజ్రాలు వచ్చాయి. వాటికి ఏ విధమైన పత్రాలు లేవు.
సుబ్బు: (మనసులో: అయిపోయాను)
కోశాధికారి: ౧౩ మరియు ౧౫ నేను సంపాదించేది.
సుబ్బు: ఆ రెండు రోజులు ఏముందిరా?
 కోశాధికారి: ఏముందిరా ముందురోజు కొంటారు అవి పత్రాలు లేనివి కాబట్టి వాటికి ఎవ్వరూ Bills ఇవ్వరు, ఈ Software/College students వాళ్లకు ప్రగల్బాలు పలకడం తప్ప, ఇలాంటివి వచ్చే సరికి మాకు లంచాలు ఇవ్వడానికి వెనకాడరు.
సుబ్బు: మరి తరువాత రోజు ఎందుకు?
 కోశాధికారి:ఏముందిరా మరి Gift తీసుకున్న వాళ్ళు Gift Tax చెల్లించాలి కదా, ముందు రోజు కొన్న వాళ్ళు రెండవ రోజు తీసుకున్న వాళ్ళు.
సుబ్బు:(మనసులో: హమ్మయ్యా బ్రతికాను)
 కోశాధికారి: అవునురా ఇంతకీ నా వాటా ఏది?
సుబ్బు:(మనసులో: నన్ను కూడా వదలవా!)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.