నిన్న NABARD Bond చూసాను

అది ఎవరైనా కొనేసి ఉంటారు, నాకు ఇప్పుడు కనిపించట్లేదు.
నేను దాన్ని icicidirect లో చూసాను.
దాని గురుంచి ఇప్పుడు ఎందుకు మాట్లాడు తున్నాను అంటారేమో, ఈ చెత్త ప్రభుత్వాలు చేస్తున్న పని గురించి విశ్లేషిస్తున్నాను.
నేను దాంట్లో పెడదాము అనుకున్నాను, కనీస ముఖ పరిమితి ౬ లక్షలు ఉంది, నేను అంత ధనవంతుడను కాదు కాబట్టి నేను అందులో పెట్టుబడి పెట్టలేను. సరే ఇప్పుడు అది ముఖ్యం కాదు, అసలు ఈ సంస్థలు అంత ఎక్కువ పరిమితి ఎందుకు పెడతాయో అర్ధం కాదు.
ఒకవేళ చిన్న చిన్న వాళ్ళు బాగు పడతారు అనా లేకపోతే, ఇవన్నీ చూపించి FDI లు పెట్టించడానికి సరైన కారణం చేస్తున్నారో అర్ధం కాదు.
అవును ప్రతీ కార్యాలయంకు కొంత సొమ్ము కావాలి, అతి తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు, ఇప్పుడు జనాల దగ్గర చిన్న చిన్న మొత్తాలు పెట్టుబడి పెట్టడానికి మాత్రమే సొమ్ము ఉంది, అంత ఎక్కువ సొమ్ము పెట్టుబడి పెట్టడానికి సొమ్ము లేదు. అవి చిన్న investments లాగా ఎందుకు మార్చ కూడదు?

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.