కొన్ని విషయాలు ఇలా ఉంటాయి

అనగనగా ఒక ఇల్లు, అందులో కొంతమంది పని వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో ఒక పెద్ద పనిమనిషి ఉంది. ఆమె ఇంటిపనులను సవ్యంగా చేయించేది, ఇల్లు శుభ్రంగా ఉండేలా చేసేది, ఇంట్లోకి electronic Items వచ్చేలా చేసింది(కొంత సొమ్ము వెనక వేసుకుంది), కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకు తిండి దొరకకుండా చేసింది. Electronic Items కొనడానికే సొమ్ము ఖాళీ అయిపోయింది. ఇలా ఆ పనిమనిషి తన క్రిందపనిచేసే వాళ్ళ చేత చాలా ఎక్కువ పని చేయించి ఇంట్లో ఉన్నా వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించింది. కానీ ఆహార విషయంలో కొంచం నిర్లిప్తత వహించింది, దానికి తోడు ఆమె ఇంట్లో పెద్ద పనిమనిషిగా ఉన్నప్పుడు వర్షాలు కూడా సరిగ్గాలేవు.
ఆమెకు కొంత చెత్త చరిత్రకూడా ఉంది అది ఆమె తన బంధువులను తొక్కేసి ఆ స్థానంలో కూర్చింది అని. అది అందరికీ తెలిసిన నిజమే, ఇదేకాకుండా అమే పేరుమీద Malaysia Singapore లలో ఇంట్లో వాళ్ళనుంచీ దొచుకున్న సౌమ్ములనుంచీ కట్టడాలు ఉన్నాయి అని ఒక పుకారు కూడా ఉంది.
ఇది అదునుగా చేసుకుని ఈ పని మనిషి ముందు పనిచేసిన పెద్ద పనిమనిషి వర్గంలో మనిషి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళ బాధలు తెలుసుకుని(నిజానికి ఆ బాధలు తెలుసుకోవడానికి వాళ్ళకు డబ్బులు ఇచ్చింది Conversion చేయించే సంస్థ) ఆ ఇంట్లో వాళ్ళను మభ్యపెట్టించి ఇంట్లో పెద్ద పనిమనిషి స్థానం సంపాదించింది.
ఆమె చరిత్ర జగమెరిగినదా అంటే కాదు ఎందుకంటె అప్పటివరకు ఇంట్లో వార్తలు సమకూర్చే వారితో సత్సంబంధం ఏర్పర్చుకుని పాత చరిత్ర బయటకు రానివ్వకుండా చేసింది ఆ కొత్త పనిమనిషి.
ఇప్పుడు పీఠం ఎక్కిన తరువాత ఆమె అసలు రంగు బయటపడింది. ఇంట్లో ఉన్న ఇనుప సామానులు బయటవారికి అమ్మేసి ఇంట్లోకి Plastic సామానులు తెప్పించింది. ఇప్పుడు వాటి వల్ల చాలా అనర్ధాలు బయట పడుతున్నాయి. ఇంట్లో ఇనుపవస్తువులు అమ్మితే ఇంట్లో వాళ్ళకే కదా మిగులుద్ది అని చెప్పి తన conversion సంస్థ ప్రతినిధి(అమె బంధువు) కి అమ్మి ఆ డబ్బులు ఇంట్లో ఇచ్చి ఆ సంస్థ ప్రతినిధి చేత ఎక్కువ సొమ్ముకు అమ్మించుకుంది.
తరువాత ఇల్లు పాతబడిపోయింది అని లేదా ఇంట్లో జనాలు ఉండడానికి స్థలం సరిపోవట్లేదు అని నమ్మించి తన కూతురి సంస్థకు Cement తయారీకి అవసరమైన ముడి సరుకులు చవకగా లభించేలా చేసి ఎక్కువ ధరకు ఆ ఇంట్లో వాళ్ళచేత Cement కొనిపించి డబ్బు వెనక వేసుకుంది.
అలా కొత్త ఇళ్ళు కట్టించి మిగిలిన పనివాళ్ళ చేతులు కూడా బాగా తడిపింది. పంటలు పండే స్థలాలను SEZ క్రింది మార్చి తను ఆ స్థానంలో ఉండడానికి సహకరించిన వారికి కృతజ్ఞత చూపించి ఆ స్థలాలలో ఇళ్ళు కట్టించింది. అంతే కాకుండా విదేశాలలో మాంసాహారం ఎక్కువగా తింటారు కనుక వాళ్ళకు రొయ్యలు దొరకవు కనుక ఆ పంటపొలాలను రొయ్యలు పెంపకానికి మార్చి ఆ ఇంట్లో వాళ్ళకు తిండి దొరకకుండా చేసింది.
అయినా ఆ పిచ్చి Converted జనాలు(ఆ ఇంట్లో వారే) మతం మారినందుకు డబ్బులు వస్తున్నందుకు ఈమెను మంచి దానిగా చూపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
ఇప్పుడు మళ్ళీ ఆ ఇంట్లో పనిమనిషిని మార్చాలి అనుకున్నారు, అందుకు ఈ పనిమనిషి అనుసరించిన వ్యూహం, ఎలాగూ మతం మారిన వాళ్ళు తమతోనే ఉంటారు, ఆమె లంచం ఇచ్చిన వ్యక్తులు ఆమెతోనే ఉంటారు(అదే పాత పనిమనిషి ఉన్న సమయంలో ఎక్కువ పనిచేసి ఇప్పుడు లంచాలు భొంచేసి భవనాలమీద భవానలు కట్టించి కొడుకులను కూతుళ్ళను విదేశాలలో చదివిస్తున్నారు కదా వాళ్ళు), మరి వ్యతిరేకించే వాళ్ళును విడగొట్టి మళ్ళీ పీఠం ఎక్కాలి అనీ చెప్పి తనకు తెలిసిన వేరొక కులం అమ్మాయిని లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని పీఠం మీద కూర్చుంది. అంతే ఇక ఆ ఇంట్లో వాళ్ళు బికారిలుగా మారడం మొదలయ్యింది.
ఇప్పుడు వాళ్ళకు తినడానికి తిండి దొరకని స్థితికి చేరుకున్నారు.
ఇదే అదునుగా చూసుకుని తమకు ఇలా తక్కువ పనిచేసి ఎక్కువ డబ్బు సంపాదించే అవకాసం రాలేదు అని బాధపడిన (వాళ్ళని Marxist సిధ్ధాంత వాదులు అంటారు) వాళ్ళు ఈ కొత్త పనిమనిషి నుంచీ లబ్ధిపొంది వాళ్ళను భయపెట్టి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు.
ఇక ఆ ఇంట్లో వాళ్ళను కాపాడుదాం అని రచనలు చేసే వాళ్ళు తమ రచనలు అమ్ముకుని లాభాలు ఆర్జించి బ్రతక నేర్చారు. ఇంకొతం మందికి స్వదేశంలో లభించే తిండిగుడ్డ పనికి రావు విదేశాల నుంచీ తెప్పించుకోవడం అలవాటు, ఏమైనా అంటే దీనిలో Vitamins తక్కువ లేదా ఇవి తింటే మేము లావైపోతాము అనే వాళ్ళే, ఎందుకంటే శ్రమ నుంచీ తప్పించుకునే వాళ్ళే ప్రతీవాళ్ళు.
ఇది ప్రస్తుత భారతావని స్వరూపంలోని ఒక చిన్న అంశం.