నిజంగా ప్రజలకు అవసరమా?

ఇది వరకు ఎన్నికలప్పుడు ఎన్నుకోవడానికి మనిషికి ౧౦౦౦ ఇచ్చారు.
కానీ ప్రస్తుత పరిస్థితులలో అది సరిపోదు, అంతే కాకుండా మధ్య తరగతి ప్రజలకు ఈ ప్రభుత్వం గురించి తెలిసింది. అందుకే ఈ FDI ఇప్పుడు ఆదరా బాదరాగా FDI అనుమతులు ఇవ్వడానికి కారణం
ప్రభుత్వానికి చాలా వేగంగా డబ్బు కావాలి పంచి పెట్టడానికి లేకపోతే వొచ్చే ఎన్నికలలో గెలవడం సంగతి అటుంచితే కనీసం Deposit దక్కడం కూడా చాలా కష్టం అందుకే ఇది ఎందుకంటే పేదలకు ఎవడు డబ్బులు ఇస్తే వాడే దేవుడు కళ్ళు మూసుకుని వాడికి గుద్దుతారు, అంతే కాకుండా ఒకవేళ ఓడిపోయినా(అసలు నగ్గే అవకాశమే లేదు అని కొందరు అనుకుంటున్నారు - ఈ కుహునా రాజకీయాలు ఉన్నంత వరకు ఏమీ చెయ్యలేము) డబ్బు ఇప్పుడు జగన్ దాచినట్టు దాచేసి గనులన్నీ వాళ్ళ వాళ్ళకి లేదా సొంతానికి అప్పనంగా అప్పగించి నెగ్గిన పక్షానికి డబ్బు అందుబాటులో లేకుండా చేసి ప్రజలలో నెగ్గిన పక్షం ప్రజలకు ఏమీ చెయ్యలేదు అని చూపించి మధ్యంతర ఎన్నికలు తెప్పించి మళ్ళీ పీఠం ఎక్కవచ్చు.

నిజానికి వీటి వల్ల ఈ రెండు సంవత్సరాలు లాభపడి తరువాత మళ్ళీ అయిదు సంవత్సరాలు మనల్ని బానిసలు చేసే వ్యూహం.

మనకు అసలు plastic అవసరం లేదు ఎందుకంటే మన దేశం లో ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి, ఉదాహరణకు సంచులు తీసుకుంటే పీచు నారా టో తయారు చేసిన సంచులు ఉన్నాయి
బాల్ది దగ్గరకు వస్తే వాటిని ఇదువరకు ఇనుముతో తయారు చేసే వారు.
బట్టలు పత్తి ఉంది.
 ఆహారం మన దేశంలోబియ్యం గోధుమలు సమృద్దిగా ఉన్నాయి.

అసలు  వీటికి ప్రత్యామ్న్యాయంగా ఎందుకు తయారు చేశారు ఇప్పుడు మనం వాడుతున్న వస్తువులను, ఎందుకంటే ఒకడి డబ్బు పిచ్చి. అంతెందుకు బియ్యం గిడ్డంగి నుంచీ బయటకు రావట్లేదు అవి అక్కడ మగ్గి మక్కి పోతున్నాయి అయినా అన్నం తింటే లావైపోతాను అని అనుకునే పిచ్చి జనం కూడా తక్కువేం కాదు.
కొంతమందికి Software companies రావడం వల్ల లాభాలు ఉన్నాయి అంతే కాకుండా ఉద్యోగాలు పెరిగాయియా అని వ్రాయడం అలవాటు కానీ వాళ్ళకు నిజం తెలుసా దాని వల్ల మనం విజ్ఙత కోల్పోయాము, ఉదాహరణకు చర్మం కాంతి వంతంగా ఉండటానికి మరియు మొటిమలు పోవడానికి ఇది వరకు ఆడవారు పసుపు గంధం ఉపయోగించేవారు, కానీ ఇప్పుడు వాటిలో క్రిమి సంహారకాలు ఉన్నాయి అని తెలిసినా ఆ Plastic డబ్బా వేరే పనికి ఉపయోగ పడదు అని కూడా తెలిసినా వాటిని ఉపయోగించడం మానట్లేదు. ఇలాంటివే ఎన్నో.

అసలు డబ్బు ప్రవాహం FDI లకు ఎలా జరుగుతుంది
మనం(Mutual Funds) ---->Share Market ----> Foreign investors ----> FDI చివరిగా మనం కోల్పోయేది మన డబ్బులతో మన భూభాగం.