తెలివైన వారి ప్రచురణలు అనుకుందాం అనుకుంటే అవి కాదు కేవలం వ్యాపారవేత్తల ప్రకటనలు.
మొన్నటికి మొన్న ఒకరు కుంభమేళా లో అపశ్రుతి జరిగితే బాధ పడకుండా ఎద్దేవా చేసాడు, అలంటి వాళ్ళకోసం నా ఈ టపా.
వీళ్ళు తయారు చేసినవి అమ్ముకోవడం కుదరకపోతే ఈ ఆచారాలను ఎద్దేవా చేస్తారు!
ఎంతమంది మరిచిపోయారు Bihar Gas Tragedy?
అది గుర్తు పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది.
నమ్మకం వేరు నిజం వేరు అని వాదించే వీరికి వీళ్ళ నమ్మకం వీళ్ళకే నిజం మిగిలిన వారికి కాదు అని అర్ధం చేసుకోలేరు.
వీళ్ళ అభిప్రాయం ప్రకారం "నమ్మకం చెట్లు దేవుళ్ళు నిజం చెట్లు దేవుళ్ళు కాదు"
కానీ నిజం Science prove చేస్తున్న విషయాలు
౧. ప్రాణవాయువు ఇస్తున్నది చెట్లు.
౨. వర్షాలు కురవడానికి అవసరం చెట్లు
౩. మనం తినే ఆహారం ఇచ్చేవి చెట్లు.
ఒక చెట్టు పరిశ్రమ గురించి నరికేముందు ఇవి గుర్తుంచుకో.
ఇక ఈ విషయంలో ఆ తెలివైన వారు అదే ఇప్పుడు మందులు పరిశ్రమలు తయారు చేస్తున్నారు అనే వాళ్ళ గురించి
౧. ఖనిజ సంపద ఉన్న భూమి మీద ఇళ్ళు
౨. మరి ఇళ్ళు ఉన్న ప్రదేశంలో ఖనిజాలు వెలికి తియ్యడం కుదరదు కాబట్టి వేరే స్థలంలో ఖనిజాల కోసం భూఆక్రమణ
౩. ప్రకృతిలో సృష్టించ బడినవాటిలో ఏవీ విషాలు వదలవు, కానీ ఈ పరిశ్రమలు నిరంతరంగా విషాలు వాదులు తూనే ఉంటాయి.
కొన్ని రోజుల క్రితం
Nagarjuna Fertilizers ఉదంతం, ఇంకొన్ని రోజుల క్రితం కోళ్ళ పరిశ్రమ ఇంకొన్ని రోజుల క్రితం కాగితం పరిశ్రమ వదులుతున్న వ్యర్ధాలు గురించి చదువుతూనే ఉన్నాము, అయినా సరే ప్రకృతి నుంచీ సహజంగా ఖనిజాలు నీ శరీరం తయారు చేసుకోగలదు అంటే కాదు అనే ఆ తెలివైన వాళ్ళు అసలు కారణం వాళ్ళు ప్రజలు సహజత్వం కోరుకుంటే వ్యాపారం కుంటుబడుతుంది అని ఒప్పుకోరు.
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.