Go further to get closer/Live to gether to get closer #MrAndMrs



నాకు అంత దూరం వెళ్ళాలి అని లేదు తనకి కూడా లేదు!
తనకి కావలిసినది మనం ఎంత దగ్గరగా ఉన్నాము అన్న విషయం!
కానీ  అడగకుండానే అందరి దగ్గరకు తీసుకు వెళతాను, తనకు దగ్గర కావాలి అంటే తనతో గడిపే సమయం కావాలి అన్నది మాత్రం నిజం! అందుకే ప్రతీ శని ఆదివారాలు తనతోనే ఉండటానికి ప్రయత్నిస్తాను!
అలాగని తనకు ప్రయాణాలు ఇష్టం లేదు అని కాదు!
తనకోసం ఇప్పటి వరకూ నేను వెళ్ళిన ప్రదేశాలు తనని తీసుకుని వెళ్ళిన ప్రదేశాలు
1. తిరుమల
2. కంచి
3. శ్రీకాళహస్తి
4. కాణిపాకం
5. శ్రీరంగం
ఇంకా తను నన్ను తీసుకు వెళ్ళమన్న ప్రదేశాలు
1. మదురై మీనాక్షి అమ్మవారి గుడికి
2. దక్షిణ భారత దేశంలోని చారిత్రాత్మిక ప్రదేశాలు
ఇక నాకైతే ఏదో ఒకరోజు తను పెరిగిన ప్రదేశానికి సకుటుంబ సమేతంగా తీసుకు వెళ్ళాలి అని ఉంది!

దూరంగా వెళితేనే బంధం బలపడుతుంది అని నేను అనుకోవట్లేదు, దగ్గరగా ఉంటే చాలు అనుకుంటున్నాను!
I am submitting this entry only to prove going in plane is not the only reason to make people together!

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.