నేను వ్రాయడం మనేయ్యలేదు, మనేయ్యను!

మరి ఈ మధ్య నా దగ్గరనుంచీ ప్రత్యక్షంగా ఏమీ వినపడట్లేదు అని కొందరు వ్రాయడం చూసాను! సరదాకి అన్నాను నేనేమైనా ప్రఖ్యాత వ్యక్తినా కాదు, కానీ ఎందుకు వ్రాయట్లేదు అంటే గొంతు చించుకుని అరుస్తునా పట్టించుకునే వారు లేరు!

ఇక ఏమైనా వ్రాస్తే దానికి ఒక్క + కూడా నోక్కట్లేదు దాంతో నేను వ్రాసింది నచ్చిందా లేదా తెలియట్లేదు!
ఇక అన్నీ No Comment మాదిరే! అది అన్నింటికన్నా భయంకరమైనది! అప్పుడప్పుడు - ఉంటె బాగుంటుంది అనిపిస్తుంది!

ఇక ఏమి వ్రాసినా వ్రాయాలన్నా మనసుకు తోచట్లేదు, కానీ తొందరలో ఆర్ధిక సంస్కరణలు నేను పాటించాల్సిన వాటి కోసం వ్రాస్తాను, మీకు నచ్చితే సలహాలు ఇవ్వండి, ఏమి మార్చుకోవాలో చెప్పండి!

ఇంకో విషయం నేను వ్రాయక పోవడానికి కారణం, నాకు చిన్నప్పటి నుంచీ వ్యాసరచన పోటీలు క్లుప్తంగా వ్రాయడం అలవాటు!
ఉదాహరణకు ఆవు వ్యాసం ఇలా వ్రాసే వాడిని
ఆవు గడ్డి తింటుంది 
ఆవు పాలు ఇస్తుంది 
ఆవు పాలతో పెరుగు వెన్న నెయ్య తయారు చేసుకోవచ్చు!
 
అంతే, ఇంకేమి వ్రాయాలో ఎలా వ్రాయాలో తెలియదు, అందుకే పెద్ద పెద్ద అక్షరాలతో వ్రాసి అర టావు నింపి ఇచ్చే వాడిని, ఇంకొందరు బుల్లి బుల్లి అక్షరాలతో టావు నింపే వారు! అప్పుడప్పుడు వాళ్ళు ఏమి వ్రాసారో తెలుసుకోవాలి అని కోరిక ఉండేది, కానీ ఆ అవకాశం నాకు వచ్చేది కాదు, ఎందుకంటే అప్పట్లో మా తెనుగు గురువు కేవలం టావు కంటే తక్కువ వ్రాసిన వారికి ఏమి వ్రాయాలో చూపించే వారు :(
ఇలాంటివే ఇంకొన్ని ఉన్నాయి, త్వరలో చెబుతాను!
ఇంకో రోజో రెండు రోజులలోనో మీరు నా ఆర్ధిక విధి విధానాలు చూస్తారు!
చూసిన తరువాత ఒక నెలకు అడగండి నిజంగా నీ మాట మీద నిలబడుతున్నావా అని! మరచి పోవద్దు!




No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.