చాలా కాలం అయ్యింది అందరితో ముచ్చటించి

గత కొంత కాలంగా సమాయాభావం వల్ల కావొచ్చు బద్ధకం అనుకోండి అందరితో ముచ్చటించ లేదు, కానీ ఇప్పుడు సమయం దొరికింది.
ముందుగా ఒక శుభవార్త కానీ 7 నుంచీ 8 నెలల మధ్యలో చెబుతాను!

ఇక ప్రస్తుతం నా ట్విట్టర్ లో నేను చూసే అతి పెద్ద చర్చ 498 A అనే నిభందన గురించి, అసలు ఎంత తారా స్థాయికి చేరింది అంటే అదొక్కటే బాధ ఉన్నాది అన్నట్లు. 

నేను అందులో పాలుపంచు కావట్లేదు, ఎందుకంటే నాకు అనవసరం కాబట్టి. 

ఇక రెండవది సరి బేసి విధానం, నాకైతే నవ్వాలో ఏడవాలో అర్ధం కాని నియమం అది, అది ఎప్పుడైతే సమతుల్యం ఏర్పడుతుందో అప్పుడే పెట్టాడు, దాంతో మంచి తరగతి కి చేరచ్చు అనుకున్నాడు, కానీ పని జరగలేదు సరికదా చెత్త పెరిగింది, దానికోసం తాయారు చేసిన బ్యానర్ లు cut out లు hording లు, ఇక చెత్త NDTV. మీలో చాలా మంది అడుగుతారు మరి కాలుష్యం ఎలా తగ్గించాలి అని?

నచ్చిన నచ్చక పోయినా ఇదే నా అభిప్రాయం కాలుష్యం తగ్గించాలి అంటే 
మూత పడిపోయిన ఖర్ఖనలు తొలగించి అక్కడ చెట్లు నాటడం, పాడు బడ్డ ఇళ్ళు ఖాళి గా ఉన్న ఇళ్ళు పూర్తయ్యేంత వరకూ కొత్త ఇళ్ళు కట్టడానికి అనుమతి ఇవ్వక పోవడం, plastic ఉపయోగం తగ్గించడం వీలైనంత వరకూ మానెయ్యడం. 

ఇక నాల్గవది, అదేమిటి మూడవది మాట్లాడవే అనొచ్చు, దానికి అడుసు తొక్కనేల కాలు కడగనేల. 

ఆంద్ర రాష్ట్రం కొత్త రాజధాని నిర్మాణం వల్ల అభివృద్ది అంతరాలు. అది జయప్రకాష్ గారి నుంచీ అందరి వరకూ. ప్రస్తుతానికి నాకు అర్ధం అయ్యింది, జనాలు లేకపోయినా ఇళ్ళు కాట్టే సంకృతి విజయవాడ పరిసర ప్రాంతాలలో జరుగుతుంది అని, కొందరు అందులో నువ్వు ఎందుకు పాలు పంచుకోవట్లేదు అని కూడా ప్రశ్నిస్తున్నారు కూడా, వాళ్లకు ఈ క్రింది విషయాలు చెబితే మీకు ఇల్లు ఇష్టం లేదు అంటారు 
1. కొత్త రాజధానిలో ఇల్లు కొనడం అంటే నీళ్ళు దొరకని చోట తాబేలును పెంచడం లాంటిది. 
2. అవన్నీ పంట పొలాలు 

ఇవి కాకుండా నాకు ఉన్న ఇంకొన్ని సందేహాలు, అసలు జనాలు అంతా రాజధానికి వెళిపోతే అన్నం ఎక్కడ నుంచీ వస్తుంది అని ఎవరు పండిస్తారు అని ?

ఐదవది అన్నదాత ఆత్మహత్యలు, నేను ఏమీ చెయ్యలేను ఎందుకంటే నాకు అంత ఆర్ధిక శక్తి లేదు కాబట్టి!
--
Thanks
Prasad
http://gpv-buddha.blogspot.in
"When you find peace within yourself, you become the kind of person who can live at peace with others ."




No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.