నిన్న నాకు సందేహం వచ్చింది

 మన Government FCI  లో నిలవ వుండి బియ్యం పడిపోతున్నా బియ్యం ఎందుకు ఆకలితో అలమటిస్తున్న పేదవారికి ఇవ్వట్లేదు అని. దానికి అన్నిటికన్నా చెత్త కారణం బియ్యంతో కూడా మద్యం తయారు చెయ్యవచ్చు.
రెండవది శరద్ పవార్ ఇచ్చిన statement నాకు చిన్న ముక్క కూడా అర్ధం కాలేదు. వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో ఇంకా cost తక్కువ అని. అంతకన్నా మిత వాదం ఏది ఉండదు. తయారు చేస్తున్న చోట కాకపొతే దోచుకుపోతున్న చోట తక్కువగా ఉంటుందా ఏమిటి.
మూడవది wiki leaks founder రహస్య ఖాతాలను బయటకు విడుదల చేస్తాను అన్నాడు కాని నాకు అదే నమ్మ బుద్ది కావట్లేదు. ఒక వేళ బయటకి వచ్చినా అ ధనం మంచి పనులకు ఉపయోగపడుతుంది అని అనిపించుట్లేదు.
నాల్గవది సుప్రీం court అధినంలో రహస్య ఖాతా వివరాలు కాని వాటిని అత్యున్నత న్యాస్థానం ఏమీ చేసుకుంటుందో మరి?
ఇక అయిదవది  నష్టాలు వస్తున్నా IOC ఇంకా ఎలా పనిచేస్తుంది? వాళ్ళకి డబ్బులు ఎవరు ఇస్తున్నారు?

1 comment:

  1. "ఒక వేళ బయటకి వచ్చినా అ ధనం మంచి పనులకు ఉపయోగపడుతుంది అని అనిపించుట్లేదు."

    క్షమించాలి వికీలీక్స్ వాళ్ళు పేర్లు మాత్రమే బైటపెడతామన్నారు. ఆయా ఖాతాల్లోని డబ్బులు కాదు. పేర్లు బైటబెట్టడంవల్ల ప్రయోజనం? మరేంలేదు ఈ సారి ఒక్కో ఓటుకీ ఎంతెంత తీసుకోవాలో మనకో అండర్స్టాండింగుంటుందన్నమాట.

    ReplyDelete

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.