ప్రియమైన ప్రధాని గారికి,
మీ బాధ మాకు అర్ధం కావట్లేదు మేము వెల్లడించమని అడగట్లేదు కాని చర్య తీసుకోండి లేక పొతే నల్ల ధనం బయటకు రప్పించండి. మన దేశ సమస్యలు పక్కన పెట్టి మీ సొంత సమస్యలు అదే లెండి మీరు ప్రదానిగా కొనసాగడానికి తీసుకునే చర్యల వల్ల సామాన్యుడు ఇక్కట్ల పాలు అవుతున్నాడు.
ఉదాహరణకి అన్ని మంత్రి పదవులు మిత్ర పక్షాల వారికి ఇచ్చి వాళ్ళు చేసిన scams వల్ల మీరు ఇక్కట్లో పడుతున్నారు.
మన దేశంలో ఉన్నన్ని సరైన సదుపాయాలు మరియు ప్రక్రుతి ప్రసాదించిన నిధులు చాలా ఉన్నాయి వాటిని సద్వినియోగము చెయ్యండి.
పాడి పశువులు (అది మన దేశ మొదటి సంపాదన) వాటిని కాపాడండి. ఉపాది హామీ ఇచ్చి అందరికి ఉపాది ఇస్తున్నారు అన్నారు కాని ఏమీ ఉపాది? దాని వల్ల లాభ పడుతున్నది ఎవరు. ఈ ఉపాది హామీ వల్ల మన వాళ్ళు పరమ బద్దకస్తులు అవుతున్నారు రోజుకు ౨౫౦రూ కూలి ఇస్తున్నారు అ ధనం ఎక్కడినుంచి వస్తుంది అది తిసుకున్నవాళ్ళు ఎంతమంది సరిగ్గా పనిచేస్తున్నారు?
పాడి పశువులు వదిలేసి అక్కడికి వెళ్ళి కాళీగా కూర్చుంటున్నారు. దానివల్ల మళ్ళి ధరలు పెరుగుతున్నాయి మళ్ళి కధ మొదటికి వచ్చింది అదే మీరు elections ముందు మాకు ఇచ్చినా మాట ధరలు తగ్గిస్తాను అని కాని ఎక్కడ. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మా మీద ధరాగాతం.
మీరు ఆర్ధిక మంత్రిగా చేసారు దేని వల్ల ఏది ఏ ప్రాంతం నష్టపోతుందో తెలియదా?
దయ చేసి మీ పదవిని కాపాడుకోవడం మానేసి మమ్మలిని కాపాడండి మేము మళ్ళి మిమ్మల్నే ఎన్నుకుంటాము.
ఇట్లు
ఒక సామాన్యుడు
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.