మంచుగడ్డలో రెండు..తడి..వేడి..
నాలోనూ రెండు..మంచీ..చెడూ..
అందుకే నేను..మంచుమనిషిని..
చీకటిచ్చేది రెండు..భయం..ధైర్యం..
నేనిచ్చేవి రెండు..అభయం..అధైర్యం..
అందుకే నేను..చీకటి మనిషిని..
మనసిచ్చేది రెండు..ప్రేమ..క్షమ ..
నేనిచ్చేవి రెండు..మోదం..మోక్షం ..
అందుకే నేను మనసున్నమనిషిని..
నేను...
నవగ్రహాల స్ఫూర్తిని..
అష్టధిక్ఫాలకుల యుక్తిని..
సప్తమహార్షుల ముక్తిని..
షట్చక్రవర్తుల కీర్తిని..
పంచేంద్రియాల ఆర్తిని..
నాలుగు యుగాల సూక్తిని..
త్రిమూర్తుల సమవర్తిని..
ద్విగుణాల శక్తిని..
ఏక వ్యక్తిని..
--
సాగర సంగమం సినిమా చూడ్డానికి మేము హాల్లోకి వెళ్ళేటప్పటికి మొదటి పాట మొదలైపోయింది--జనాలు నోరు వెళ్ళబెట్టి "ఓహో! శైలజ! యేం డ్యాన్స్ చేస్తోందండీ!" అనుకుంటూ చూసేస్తున్నారు.
ReplyDeleteపాట ఫూర్తవుతూండగా, "ఇదేమి శాస్త్రీయ నృత్యం?" అంటున్న నా కామెంటు కి మా ఆవిడ "ష్! చూద్దురూ!" అని మందలింపు.
(అ తరవాత కమల్ హాసన్ చెప్పింది అదే అనుకోండి)
మీరు 'డిసెండింగ్ ఆర్డర్ ' బాగానే పాటించారు.
కానీ, ఆ కవి యే అర్డర్ లో వ్రాశాడో తెలియదు గానీ, దర్శకుడు మాత్రం, దాన్ని ముందూ వెనుకా ముక్కలు చేసి, "ఇష్టం వచ్చినట్టు" వాడుకున్నాడు!
అదో కళా ఖండం లెండి!
యెదటివాళ్లు తీస్తున్న పాటల్ని హేళన చేస్తున్నట్టు నటిస్తూ, తన సినిమాలో అలాంటి పాటనీ, డ్యాన్స్ నీ చొప్పించగల సమర్థుడాయన మరి!
మీ కవిత బాగుంది!