ఏమీ మార్చలేక తిరిగి వెళ్ళి పోయిన నారదుడు


సోనియా గాంధి తో అన్నాడు నువ్వు చేసిన తప్పులకు నువ్వే బాధ్యత వహించాలి అని
దానికి సోనియా గాంధీ సమాధానం డబ్బులిస్తే నా తప్పులకి దెబ్బలు తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు ఏమీ బాధలేదు అని.
వాళ్ళని మార్చలేక ఈ సారి రాహుల్ గాంధీ దగ్గరకి వెళ్ళి అది అడిగాడు
దానికి రాహుల్ సమాధానం తప్పు చేసిన వాళ్ళు కదా నేను కాదు కదా.
ఇక వాజపేయి దగ్గరకి వెళ్ళి అంటే
ఏమో చేసిన వాటికి శిక్ష అనుభవించాలి కదా అని అన్నాడు తప్ప తప్పు సరిదిద్దుకోలేదు
ఇక అద్వాని కూడా వాజపేయి సమాధానమే చెప్పాడు.
మరి కరుణానిధి దగ్గరకి వెళితే సమాధానం చాలా వెటకారంగా వచ్చింది ఎమిట అనుకుంటున్నారా
నేను మళ్ళి ద్రావిడ మున్నేట్ర కజగం party స్థాపించి తప్పించుకుంటాను అని.


ఇంత విన్నాక కొంచం అసిన ఉన్న నారదుల వారు సామాన్యుడు దగ్గరకి వెళ్ళి అదే ప్రశ్న అడిగితె
నేను చేసిన తప్పు ఒక్కటే ఈ నాయకులను ఎన్నుకున్నాను దానికి ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నాను ఇంకేమి శిక్ష ఉంటుంది అని


ఏమీ మార్చలేని నారదుల వారు తిరిగి వెళ్ళి పోయారు.
ఒకే ఒక్క సందేశం వదిలి
మీరు మంచి నాయకులను ఎన్నుకోండి మీరు ఈ కష్టాలనుంచి బయట పడతారు అని. 

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.