ఇప్పుడు scam వల్ల లాభ పడినది ఎవరు


నేను వాళ్ళని సమర్దించట్లేదు కాని లాభ పడినది మాత్రం మనం అని అనుకుంటున్నాను.
ఎందుకంటారా వీటి వల్ల మన call rates తగ్గినాయి.
అదొకటే కాదు ఒక వేళ నిబందనలు అనుసరించి అందరూ సరిగ్గా చెల్లించి దక్కించుకుని ఉంటె ఆ ధనం మళ్ళి ఏదో కుంబకోణం కింద బయట పడుతుంది అంతే తేడా.
కాని ఒక విధంగా మనం నష్టపోతున్నాము ఎందుకంటే ఎక్కువ సేపు మాట్లాడడం మరియు దగ్గర ఉన్న వాళ్ళ కంటే దూరంగా ఉన్న వాళ్ళతో మాట్లాడడం వల్ల మనతో ఉన్న వాళ్ళ గురుంచి తెలుసుకోలేక పోతున్నాము.

నన్నే ఉదాహరణ కింద తీసుకుంటే
నాకు నెలకు ౧౦౦౦ నెలసరి అద్దె తరువాత Service Tax అని ఇంకో పన్నెండు శాతం లాగేసే వారు దీని పుణ్యమా అని నేను నెలకు ౩౩౩ రూపాయలు వెచ్చించి సరిపెట్టు కుంటున్నాను.
   

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.