అయ్యోరు పట్ట భద్రులు అయినారు

పట్ట భద్రులు కాగానే రాజ్యాన్ని జయించినంత ఆనందం, ఇక తనని ఎవరూ ఆపలేరు అని నమ్మకం.(నా గురుంచి)

చేతిలో Degree ఉంది, కొన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసాను, వచ్చింది. సరే అని ఉద్యోగంలో చేరాను. తరువాత తెలిసింది అసలు చదివింది చేస్తున్నది పొంతనలేదు అని.
సరే సర్దుకుపోయాను. సమయం గడిచింది Recession వచ్చింది మొదట బయటకి పంపడానికి ప్రయత్నించారు(అప్పటి Manager నా మీద నమ్మకంతో ఆపించాడు,ఒక Drive లో బతికాను). ఈ సారి company నష్టాలలో పడింది, చాతుర్యం లేని వాళ్ళని, వాళ్ళ వాళ్ళని మాత్రమే ఉంచి మిగిలిన వారి పంపించారు. నాకు అప్పుడు తెలిసింది, వాళ్ళు నన్ను తొలగిస్తున్నారు అని. తీసేసారు, నేను కారణం అడగలేదు ఎందుకంటే నాక్కూడా తెలుసు నేను మంచి C programmer నేగాని వాళ్ళకి కావలసిన దానిలో చాతుర్యంలేదు అని.

నమ్మకం పోలేదు కొన్ని రోజుల తరువాత మళ్ళీ ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు చాతుర్యం తెచ్చుకుందాము అనుకుంటున్నాను జరగట్లేదు, ఈ రోజు పనిచేసిన దానిలో రేపు పనిచెయ్యట్లేదు రేపు చేసిన దానిలో మరునాడు చెయ్యను అని. అప్పుడు తెలిసింది ఎదయినా పట్టా వచ్చేసరికే పట్టాలమీద ఉండాలి అని. మరి మీరు కూడా నాలాగా అవ్వకండి(చదువుకునేవాళ్ళు).
నెగ్గినవాడు వాడు ఎందుకు నగ్గాడో చెప్పగలడు ఓడిన వాడు వాడు ఎందుకు ఓడాడో చెప్పగలడు, నాలాంటి వాడు రెండూ తెలిసి ఇంకొకడికి చెప్పగలడు మాత్రమే! ఆచరించలేడు.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.