గౌరవనీయులయిన నారదుల వారికి,
మీరు ఒక్కరిని మార్చి వెళ్ళీ పోయారు. ఇక్కడ కుప్పలు తెప్పలుగా తయారవుతున్నారు.
అన్యాయంగా సంపాదించిన దానివల్ల వచ్చే దుష్పరిణామాలు మీరు వాల్మీకి గారికి మాత్రమే చెప్పి రామాయణం పూర్తి చేయించారు గాని, తరువాత తరాలు వాళ్ళని మార్చలేక పోయారు.
ముఖ్యంగా ప్రజలని.
కర్మ సిధ్ధాంతాన్ని మాప్రజలు వదిలివేసారు. మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు మళ్ళీ కర్మ సిధ్ధాంతాన్ని జనానికి ఎప్పుడు భోదిస్తారు.
మా ప్రజలు దీన్ని వల్ల ఇప్పుడు చాలా ఇబ్బందులలో ఉన్నారు, అన్నింటికన్నా పెద్ద సంసయం ఇక్కడే వచ్చింది - దోచుకుతింటున్నాది నాయకుడు/వ్యాపారి/ఉద్యొగి దానివల్ల నేను ఎందుకు శిక్ష అనుభవిస్తున్నను అనుకుంటున్నాడు. అది అతని కర్మ అని గుర్తించట్లేదు. ఆ నాయకుడుని/ వ్యాపారిని /ఉద్యొగిని ఆపగలిగి కూడా ఆపట్లేదు.
మొన్న ఎన్నికల ఫలితాలు చూస్తే
నగ్గిన విధానం
౧. సానుభూతి.
౨. ఇప్పటివరకు పాలించిన వాడు తనకు అన్యాయం చేసాడు అందుకు వేరే వాడికే నా Vote అన్నట్టు.
౩. ఇప్పటి వరకు వీళ్ళకి అధికారం ఇచ్చాను ఇప్పుడు వాళ్ళకి.
౪. డబ్బు ఎవరు ఎక్కువ ఇచ్చారు.
౫. ఎక్కువ హామీలు ఎవరు ఇచ్చారు.
౬. Local వాడు(అంటే రెండవ అభ్యర్ధి పరాయివాడు అనుకోవాలి).
కొంచం కూడా సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారు.
దయతలచి కొంచం తొందరగా వచ్చి మమ్మల్ని కాపాడండి.
No comments:
Post a Comment
తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.