కొన్ని అనుకున్నవి సులభంగా జరుగుతాయి

Morning Bus ticket కి చిల్లర లేనప్పుడు Conductor చేతులేత్తేస్తాడని.

ఈ రోజు అదే జరిగింది, జీత వచ్చిన రెండవరోజు  - జేబులో ౨౦ రూపాయలు నాలుగో ఐదో వందలు ఉన్నాయి.
అల్పాహారం చేసి వాడి చేతిలో ౨౦ రూపాయలు పెట్టాను, తరువాత Bus Stop కి వెళ్ళి జీబులో చూసుకుంటే అన్నీ వందలే, సర్లే Volovo వాడి దగ్గర ఉండదా అని ఎక్కాను, అంతే వాళ్ళ దగ్గరా అన్నీ వందలే ఇంకా చెప్పాలంటే అయిదువందలు కూడా ఉన్నాయి.
 అనుకున్నట్టే Conductor మొదలు పెట్టారు, అందరూ వందలు వేలు తీస్తుంటే మేము ఎక్కడి నుంచి తీసుకు రావాలి అని. తరువాత సంగతి మామూలే వాళ్ళు చిల్లర తీసి ఇచ్చారు.
అప్పుడు గుర్తుకు వచ్చింది Mister పెళ్ళాం చిత్రం లో రాజేంద్ర ప్రసాదు భార్యను అడుగుతాడు కదా ౨౦ పైసలు(ఇప్పుడు ౨౦ రూపాయలు) చిల్లర ఎక్కడ పెట్టావు అని, అది తలుచుకుని నవ్వు కున్నాను.
ఈ సారి నుంచి ఇంటి నుంచి బయలుదేరే ముందు ఆ video play చేసుకుని చిల్లర పెట్టుకోవాలి.

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.