ఇంక వేరే విషయాలు ఏమీ దొరకవా?

ఎన్ని రోజుల నుంచో చూస్తున్నాను

మనం ఇంత శక్తిని దుర్వినియోగం చేస్తున్నామా అనిపిస్తుంది

ఎలాగా అంటారా

౧. నాలాగా Blogging చేస్తూ
౨. మీలాగా చదువుతూ
౩. వేరే ఎవడో వ్రాసిన కదనాన్ని మనం మన Blog లో వ్రాసి
౪. ఎవడో పని పాటా లేని వళ్ళు (అదే .ళ్ళు అమ్ముకునేవాళ్ళు) ఏదో చేస్తే అది వ్రాసి దాన్ని మనం చదివి.

అలా చెప్పుకుంటూ పోతుంటే fake politicians .డ్డి కడిగారు అని కూడా దాని మీద ఒక కదనం మళ్ళీ దాన్ని సమర్దించే వాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు.

ఎప్పుడయినా మనం చదివే మొదటి పేజీలో రైతులు ఏ పంట వెయ్యలో, ఎక్కడ ఏ పంట వేస్తే నష్టం తక్కువ ఉంటుందో ఉందా ఉండదు, పని పాటా లేని వాడు వ్రాసే ఒక చెత్తకి మళ్ళీ సమాధానం ఇవ్వడానికి కొంత స్థలం, ఇంకొంత స్థలం advertisements కి దుర్వినియోగం చెయ్యడం తప్ప ప్రజలకు ఉపయోగ పడేది లేదు.

ఇంత చెబుతున్న నాకే సరిగ్గా ఎలా చెయ్యాలో తెలియట్లేదు.

ఏది ఏమయినా ఇది నా అభిప్రాయం.