ఇదేలే తరతరాల చరితం

నేను కొంచం చరిత్రలో weak, ఏదయినా తప్పులు ఉంటే క్షమించండి. అనగనగా ఒక భోజనశాల, అక్కడ అంతా సవ్యంగా జరిగేది, అప్పుడప్పుడు పక్క భోజనశాలని తమ ఆధీనంలోకి తీసుకు వచ్చి, వాళ్ళకి నచ్చినట్టు చేయించేవారు.

కొన్ని రోజులకు ఒక వర్తకుడు వచ్చి చింతపండు తక్కువ ధరకు అమ్ముతాము అంటే ఆలోచించకుండా వాడి దగ్గరనుంచీ కొనడం మొదలు పెట్టాడు, వాడు తన ఊరి వాడు కాడు అని తెలిసి కూడా కొనడం మొదలు పెట్టాడు.

కొన్ని రోజులకు వాడి అసలు రంగు బయట పడింది, ఇక్కడ డబ్బు దోచుకుపోవడానికి చేసిన ప్రయత్నం కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి అప్పటికే ఈ భోజనశాలతో గొడవ ఉన్నవాళ్ళ మద్దతు కూడగట్టుకుని ఈ భోజనశాలని తన ఆధీనంలోకి తీసుకున్నడు. కాలం గడిచింది,వాడికి మద్దతు పలికిన భోజనశాల వాళ్ళకి అర్ధం అయ్యింది, వాడు తమ సొమ్ముతో బ్రతుకుతున్నడు అని, ఎంతతిన్నా సరిపోని పొట్ట కదా మరి, ఎదురు తిరిగారు, బయటకి నెట్టడానికి ప్రయత్నించారు, అప్పటికే చేయి దాటి పోయింది, డబ్బులు లేవు, అంతా వాళ్ళు దోచుకు పోయారు, ప్రజలకు వాళ్ళు డబ్బు వ్యామోహం చూపించి, తమ వంటలు బాగుంటాయి అని నమ్మబలికి , తమ మతంలోకి మార్చుకుని ఈ భోజనశాల వారిని అణగదొక్కి నశింపజేసేసారు.

ఇక చేసేది ఏమీ లేక వారి వస్తువులు కొనడం మానేసి స్వశక్తితో బ్రతకడం మొదలు పెట్టి వాళ్ళని వెళ్ళగొట్టడానికి ఒకరిని తయారు చేసారు.

అతని నాయకత్వంలో ప్రజలు కూడా నిజం తెలుసుకుని, ఎదురు తిరిగారు. కొంతకాలం తరువాత వాళ్ళు ప్రయత్నాలు విరమించుకుని, తమకు తెలిసిన దొడ్డిదారిన కొంతమంది నాయకులను తయారు చేసారు. కొన్ని రోజులతరువాత అంతర్గత కుమ్ములాటలో కొత్త నాయకుడు అస్తమించాడు.

అతని సన్నిహితుడు ప్రియమిత్రుడు మళ్ళీ సొంత భోజనశాల(వర్తకుల నుంచీ మారిన బుర్రతో, అదే బుర్రకలిగిన ఇంకొంతమందితో) ప్రారంభించాడు. ఈ భోజనశాలలో అన్నీ అతుకులు బొతుకులే, అంతా Capitalism లాగా తయారయ్యింది. కొన్ని రోజులకు ఆ వర్తకుడిలా తయరయ్యాడు నాయకుడి ప్రియమిత్రుడు. ఎంత మంచి భోజనం తయారు చేసాము కాదు ఎంత మిగిలింది. మరి వచ్చిన డబ్బులతో కొంత తన మింగి మిగిలిన దానితో తనక్రింద పనిచేసే ఇంకొన్ని భోజనశాలలను నిర్మించి దానిని తన రాజ్యాగం అన్నాడు. కొన్ని రోజుల వరకు అంతా కనిపించకుండా దొచుకున్నాడు, తరువాత కాలచక్రంలో కలిసిపోయాడు.

మరి తరువాత నాయకులు ఎవ్వరూలేరు(కాదు ఉన్నా వాళ్ళ పేరులో నాయకుడి పేరు లేదు కదా) అందుకు నాయకుడి పేరు కలిగిన ఒక స్త్రీని(అదేలెండి నాయకుడి మిత్రుడి కుమార్తే) భోజనశాల యజమానినిజేసింది. ఇది నచ్చని కొన్ని భోజనశాల యజమానులు మేము మీతో ఉండము అని విబేదించాయి. వారిని అణగదొక్కి తన భోజనశాలకి డబ్బు వచ్చేటట్టు చేయించింది. ఇది తట్టుకోలేని ఆమే రక్షకుడు, ఆమేని అంతమొందించాడు.

ఆ గొడవల్లో ఇంకో సంస్కరణం చేస్తాము అని కొంత మంది వచ్చారు, వారిని కొంతమంది నమ్మారు, నమ్మి వారికి కొన్ని భోజనశాలలు నడిపేలాగా చేసారు. మరి డబ్బుమహిమో ఏమో,వాళ్ళూ ఆ వర్తకులలా తయారయ్యారు.

మరి ఆమె తదనంతరం ఎవ్వరూ అలోచించకుండా ఆమె పుత్రునకి అధికారం కట్టబెట్టారు. అతను వేరే దేశంలో అమ్మాయిని వివాహమాడి, ఇక్కడ భోజనశాలని నడపసాగాడు. కొంతకాలం బాగానేసాగింది, తరువాత తెలిసింది, అక్కడకి వస్తున్న ప్రజలకు వాడు కుళ్ళిపోయిన వాటిని తమకు అంటగట్టి అందమగా ముస్తాబుజేసి ఇస్తున్నాడు అని, ముందున్నవారు కనీసం తమ ప్రజలు తయారుజేసిన వస్తువులను కొని తమ వాళ్ళకు న్యాయం జరిగేలా చూసాడు అని నాలుక్కరుచుకున్నారు , అప్పుడు అనుకున్నారు అక్కడి ప్రజలు చేతులు కాలాకా ఆకులు పట్టుకొన్నామని. ఏమీ చెయ్యలేని పరిస్థితి.. ఇంతలో అతను చేసిన పనికి అతనిని కొంతమంది అంతమొందించారు.

మరి తరువాత తరం నాయకుడు ఎవరు?? అందరిలోకి మంచివాడు, కొంత వరకు ఆర్ధిక వ్యవస్తను సన్మార్గంలోకి తీసుకుని వచ్చిన వాడిని నాయకుడిని చేసారు. వాడికి తెలుసు తన పదవీకాలం తరువాత మళ్ళీ పాత వంశస్థులకే పట్టంగడతారు, ఎలాగయినా దీన్ని ఆపాలి అని. అందుకు నాయకుడి పేరు కలిగిన వారిని అణగదొక్కడానికి ప్రయత్నించి విఫలయయ్యి, ఎవ్వరికీ తెలియని స్థాననికి పడిపోయారు.

ఆయనను అక్కడి నుంచీ తప్పించారు పెద్ద భోజనశాల క్రింద పనిచేసేవాళ్ళు. ఇప్పుడు చిన్న భోజనశాలలో కూడా వంశం అనే దాన్నుంచీ బయటపడడానికి ప్రజలు ప్రయత్నించారు. జరగలేదు. కొన్ని చోట్ల జరిగింది. దాంతో ఇప్పుడు పెద్ద భోజనశాలలో నాయకుడి పేరు తగిలించుకున్న వారిని నాయకుడిని చెయ్యడం కుదరలేదు ఎవరో ఒకరని ఒకరికి అంటగట్టి వదిలించుకున్నారు.

కానీ సఖ్యత కుదరలేదు ఒక సంవత్సరకాలంలోనే వారిని క్రిందకి దించారు. ఈ సారి చేపకింద నీరులాగా ఆ స్త్రీ కాలంలో ఎదురుతిరిగిన వాళ్ళు వచ్చారు అధికారం చేబట్టారు. కానీ ఎంతోకాలం నిలబడలేదు(కేవలం ౧౩ రోజులు మాత్రమే) తరువాత మళ్ళీ వాళ్ళే మంచి శక్తిగా మారి నాయకత్వంజేబట్టి, ప్రజలచేత జేజేలు కొట్టించుకున్నారు. ఎంతయినా డబ్బు చెడ్డది కదా. ౯ సంవత్సరాల తరువాత వాళ్ళని మార్చింది. ఇక ప్రజల నమ్మకాన్ని కొల్పోతున్నాము అని నాయకత్వంనుంచీ బయటకు వచ్చింది.


అంతే మద్దతు కూడబెట్టుకుని నాయకుడీ పేరు కలిగిన వర్తకులు, వీళ్ళని అచేతనం చేసి(కొంత మంది వర్తకులతో కలిసి పోయారు-ఎంతయినా డబ్బు డబ్బే కదా) కూలగొట్టలేని విధంగా ఆ భోజనశాల పీఠం ఎక్కారు. వాళ్ళు ఎక్కకూడదని తన బంట్రోత్తుని ఎక్కించారు. మరి ఇంకొన్ని రోజులకు ఆ బంట్రోత్తుని తప్పించి, ఆ నాయకుడి పేరుతో చలామణి అవుతున్న వర్తకుల పుత్రరత్నాన్ని ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇంకా మంచి నాయకులు ఎవ్వరూలేరా అంటే ఉన్నారు కానీ వాళ్ళు పెడుతున్న భిక్షంతో బ్రతుకుతున్న చిన్న భోజనశాల నాయకులు కదా, చరిత్ర పునరావ్రుతం అవుతుంది అని భయపడుతున్నారు.

నాణ్యత లేకున్న తినడం ప్రజలు అలవాటుజేసుకున్నారు.


ఎవ్వడూ ఆలోచించడు డబ్బంతా వాళ్ళ దగ్గర మూలుగుతుంది ఎంత కాలం ప్రజలు బ్రతకగలరు అన్న సందేహం వస్తుంది. చూద్దం ఏమవుతుందో మరి??????

ఎన్నాళ్ళు ఈ Sudo నిరంకుశత్వం బ్రతుకుతుందో?
History of India Indian politics Snatchers of freedom