ఎనిమిది తలుపులు రెండవ భాగం

గగన్ కుమార్ అనే నేను పేరులాగా అందంగా ఉండను, కొంచం లావుగా నల్లగా ఉంటాను.........
మరి నన్ను వివాహమాడడానికి విన్నీ ఎలా ఒప్పుకుందో అర్ధం కాలేదు, నా అద్రుష్టం అనుకున్నాను. కానీ నిజంగా నన్ను ఆట పట్టించట్లేదు కదా అని తెలుసుకోవడానికి వెళ్ళి ప్రశ్నించాను....

నేనంటే చాలా ఇష్టం అంది. ఏదో నా అద్రుష్టం అనుకున్నాను.

 విన్నీకి ఒక తమ్ముడు ఉన్నాడు వాడి పేరు ఈ ఊరి జనమంతా భయపడే రావల్ .....

నాకు తెలిసినంత వరకు రావల్ ని నేను చాలా తక్కువ సార్లు చూసాను.

పెళ్ళయ్యింది అంతా బాగానే ఉంది. ఒకరోజు రావల్ వచ్చి విన్నీ తలమీద ........ గురి పెట్టి నాకు Bank hacking code కావాలి అని అడిగాడు, విన్నీ మీ అక్క అన్నా వినిపించుకోలేదు. ఇక తప్పక నేను తయారు చేసి ఇచ్చాను. తీసుకుని విన్నీ తో సహా ఈ ఊరు వచ్చాడు.

మా అత్తమామల ద్వారా ఈ విషయం తెలిసి నేనూ ఈ ఊరు వచ్చాను. అప్పుడు తెలిసిందేమిటంటే మా అత్తమామల్ని రావల్ చంపేసి నేరం నామీదకు వచ్చేలా చెయ్యడానికి ఎవరో Mimicry artist సాయం తీసుకున్నాడు.

అసలు ఈ Mimicry artist  ఎవరు అన్న విషయం నాకు తెలిసే సరికి నన్ను కూడా ఈ భయంకర ప్రపంచంలోకి తీసుకు వచ్చాడు. అప్పటి నుంచీ నా మనసుకు నచ్చకున్నా చాలా చెడ్డ పనులు చెయ్యవలసి వచ్చింది.

(సశేషం.)