ఎనిమిది తలుపులు పదమూడవ భాగం

CBI Report లో గగన్ మీద గగన్ inquiry వేయించమనడం నీకు చాలా Surprising గా ఉంది కదా నాక్కూడా.
దీని శక్తి అమోఘం. గతం చూడొచ్చు కాని ఇది అక్కడ ఉన్న సమయంలో మాత్రమే. ఒక ప్రక్క దాని Time portal Space portal శక్తి పెంచుతూ దాన్ని ఉపయోగించిన సమయాలు చూస్తున్నాను.
నిన్ను కోల్పోయిన రోజు దాన్ని ఉపయోగించలేదు(18/04/2026)
దాన్ని ఉపయోగించిన రోజు, నా Dairy లో ఒక విలేకరి చనిపోయిన రోజు అది September 14 2028. దానికి ముందు రోజు ఆ విలేకరి నా మీద ఒక Comment వ్రాసాడు, దాంతో అతనిని అందరి ముందూ చంపుతాను అని. దానితో నేను కాదు ఈ తప్పులు చేస్తున్నాను అని నిరూపించుకోవడానికి అతనిని చంపుతాను అని అన్న రోజు అతనితో కూర్చున్నాను, అందరి సమక్షంలో అందరూ చూస్తుండగానే ఒక Cy-bot అతన్ని చంపేసింది. ఆ Cy-bot ఇక్కడ ఉన్న వాటిలో ఒకటి.
ఎవరు చేస్తున్నారు అనే విషయం ఇంకా అంతుపట్టట్లేదు. ఇంకొన్ని రోజులు చూసాను అది జనవరి మూడు ౨౦౨౫, రావల్ కి నిషాకి గొడవ జరుగుతున్నట్టు వాళ్ళు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని.
రావల్: ఇదంతా చేస్తున్నది గగన్
నిషా: గగన్ నిన్ను ఉపయోగించుకుంటున్నాడు
రావల్: అదేమి కాదు
నిషా: అసలు గగన్ కు నువ్వంటే చిన్న చూపే
రావల్: ఏమిటి నీ సోది రేపు నేను తెలుచుకోవాలి అంతే కదా సరే...
తరువాత ఏమి జరిగిందో అని జనవరి ౨౦౨౫ లో అంతా వెతికాను జనవరి నెలకి సంబందించిన సమాచారం ఏమీ లేదు....
మళ్ళీ ఈ యంత్రపు సామర్ద్యం పెంచడానికి కృషి మొదలు పెట్టాను.
(సశేషం..)