ఎనిమిది తలుపులు పదిహేడవ భాగం

తేదీ:౩౧/౧౦/౨౦౩౯(31/10/2039):
నాకు ఈ ఉదయం ఒక సందేశం వచ్చింది, ఈ రోజు నువ్వు నీ ఖాతా వివరాలు అన్నీ భరత్ కు తెలుపు అని. అది పంపినది నేనే. ఆశ్చర్యపోయాను! నాకు నేను పంపడమేమిటి ఏదో Karthik Calling Karthik లాగా. సరే అదేమిటో చూస్తాను గానీ, నా ఖాతా వివరాలు తెలుకోవలిసిన సమయం వచ్చింది.
మళ్ళీ ఈ కాల ఉపకరణి ఉపయోగించి నాకున్న Bank Account's (ఖాతా) ల గురుంచి చూడటం మొదలు పెట్టాను(ముందే చెప్పాను కదా దాన్ని పట్టుకుని ఏదయినా అనుకుంటే దానికి సంబందించిన విషాయాలు బయటకు తెస్తుంది అని).
UBS: ***************************
Nominee: Bharath
Central Bank: *******************
Nominee;Kaveri

ఇవి నాకు తెలియకుండా నేనే(Multiple personality disorder) తెరిచిన ఖాతాలు.
నేను దాచిన డబ్బును
ICIC:*********
Nominee: Bharath & Kaveri
ఇదంతా నీకు ఎందుకు చెబుతున్నాను, నా వల్ల/ విన్నీ వల్ల మోసపోయిన వారందరినీ నువ్వు ఆదుకుంటావు అని. మరి నీకోసం ఏమీ చెయ్యలేదా అని సందేహం రావచ్చు. నేను college లో చేరిన రోజు నుంచీ సంపాదించిన ప్రతీ రూపాయి నీ కోసమే.

ఇక విన్నీ దగ్గర నుంచీ రాబట్టాలి ఎలాగ?

ఎలా ఉన్నా విన్నీ రోజూ ఒక గంట సాయంత్రం ౪/౫ మధ్యలో ధ్యానంలో కూర్చుంటుంది. అప్పుడు చెయ్యాలి.
ఈ లోగా దీనితో ఇంకా ఏమేమి చేసానో తెలుసుకోవాలి. దీనిలో ఒక Problem గతంలోకి తీసుకు వెళ్ళగలదు కానీ నాకు నేను తారసపడలేను. అంటే నేను అక్కడకి వెళితే, అక్కడ ఉన్న నేను ఉండను(ఎంతయినా మనం దేవుడు శక్తిని దాటలేం కదా!)
అప్పుడు అనుమానం వచ్చింది అసలు ఆ రోజు Mail పంపినది ఎవరో తెలుసుకుంటే బాగుంటుంది అని. నాకు మొట్టమొదటి mail వచ్చిన రోజుకు వెళ్ళాను. అప్పుడు Mail పంపిన వారు ఎవరా అని చూసాను. అది పంపినది నేనే. అప్పుడు అర్ధం అయ్యింది, ఇవన్నీ పంపుతున్నాది నేనే అని. నేను చదివిన సమయం కాకుండా పంపిన సమయం కి వెళ్ళి నేనే Mail పంపాను.

తిరిగి వచ్చే సరికి నాకోసం కొంత మంది మంత్రులు వచ్చారు.




నేను పండుగుల తేదీలు ఇక్కడ నుంచీ చూసి వ్రాసాను తప్పుంటే మన్నించండి.
(సశేషం..)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.