పొగ త్రాగడం మానేశారు

నేను ముందు పనిచేసిన కార్యాలయంలో నా సహోద్యోగి ఒకరు పొగ త్రాగడం మానేసాను అని చెప్పారు.
నేనడిగాను ఎ వైద్యుడి దగ్గరకు వెళ్ళావు అని.
దానికి అతను ఇచ్చిన సమాధానం, వైద్యుడు మనచేత మాన్పించ లేడు. మనంతట మనమే మానేయాలి అని, ఇదొక్కటే కాదు నేను ఎలాగైనా పొగ త్రాగడం మానేస్తాను అని ప్రమాణం తీసుకున్నాను కానీ మానలేదు. అప్పుడు నా భార్యకి నా పుత్రుడికి ఆపద వచ్చింది. నేను చేసిన ప్రమాణం వల్లే వచ్చింది అనుకుని మానేసాను అన్నాడు.కానీ ఇలాంటి వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు(కొంత మంది ఉన్నారు), ఈ రోజు చేసిన ప్రమాణం ఈ మానసిక నిపుణుల పుణ్యమా అని దేవుడు లేడు అని నమ్మి, నేను బ్రతికేది ఈ రోజు కోసమే అనే స్థాయికి దిగజారిపోయారు.

గతం నాగరికత, ప్రస్తుతం అనాగరికత అన్నట్టు తయారయ్యింది సమాజం.
నాకు మార్చగలిగే శక్తి ఇవ్వు అని మాత్రమే దేవుడుని కోరగాలను. అంతకన్నా ఏమి చెయ్యగలను.

Smoking and Drinking not only harms you but also harms others please live for the society and not for today.