ఎనిమిది తలుపులు పద్దెనిమిదవ భాగం

మంత్రులు ఎందుకు వచ్చారు అర్ధం కాలేదు, ఎంతయినా కొంత మంది తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు కదా. ఒకడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. అతను నాతో మాట్లాడటానికి చెయ్య చాచాడు.
ఇప్పటికే నేను దానిని చేతి తొడుగుల వలే తయారుచేసేసాను కదా, అంతే అతను ఎందుకు వచ్చాడో తెలిసింది. మిగతా వాళ్ళందరూ ఎందుకు మాట్లాడటానికి రాలేదో అర్ధం కాలేదు!

ఇక్కడ ఒక Railways Ticket reservation counter ఒకటి ఉంది. అది ఈ అత్యుత్సాహంగాడి Idea. అదేమిటి దాంట్లో ఎలా మోసం చేసాము అనే కదా నీ అనుమానం, ఈ అత్యుత్సాహం గారికి వచ్చిన ఆలోచన అలాంటి ఇలాంటి ఆలోచన కాదు. ఈ Reservation center లో ౩ Ticket counters ఉన్నాయి కానీ నిజం ఏమిటంటే ఇక్కడ ఉన్నవి నాలుగు. బయటకి కనిపించేవి మూడు, అవి కాకుండా నాల్గవది.
సంక్రాంతి దీపావళీ దశరా ఇలా ఒకటేమిటి అన్నీ.

సంక్రాంతికి ఇప్పటికే చాలా మటుకు Tickets ఈ నాల్గవ Counter నుంచీ వ్రాయించేసాము. ఇక్కడొక్క చోటే కాదు మన ఊరిలో ఉన్న Railway station లో కూడా అంతే. ఇప్పుడు మరి ఎందుకు వచ్చాడు అనేకదా సందేహం. వాడికి ఒక పెద్ద బేరం తగిలింది. ౧౫/౧౦/౨౦౩౯ (15/10/2039) నాటి ఉదయం ఇంచుమించు రాష్ట్ర రాజధాని నుంచీ వెళుతున్న అన్ని Trains లో దరిదాపు ౧౦౦(ప్రతీ train కు) Tickets మా దగ్గర ఉన్నాయి. ఆ బేరం ఎంత పెద్దదంటే ఒక్కో Ticket మీద ౧౦౦% అదనంగా ఇస్తాను అన్నారంట. మరి అవి ఎక్కడ ఉంటాయో నిద్రపోని నాకు తెలియదు. వాడు నిద్ర లెగిచేది నేను నిద్రపోయినప్పుడు. మరి ఇప్పుడు ఏమి చేసుంటాను అనే కదా నీ సందేహం.
ఇప్పుడు ఉన్నది నిద్రలో ఉన్న నేను కాదు.
వాడి చేయి పెట్టుకున్నాను, వాడికి మిగిలే ప్రతిఫలం ౨౦౦% శాతం. ఎవడు వదులుకుంటాడు అంత ధనాన్ని.
మంత్రి:ఏమి ఆలోచిస్తున్నారు.
గగన్: ఏమీ లేదు మీతో ఎలా చెప్పాలా అని.
మంత్రి: పర్వాలేదు
గగన్: ఏమీలేదు ఈ Tickets ఇప్పటికే అమ్మేసాను ౨౦౦% లాభం వచ్చింది అని
మంత్రి: నాకు చెప్పకుండానే?
గగన్: చెప్పడానికి నువ్వేవరు?
మంత్రి: అదేమిటి!
గగన్: కొన్నాది నేను అమ్మింది నేను మధ్యలో నువ్వు ఎవరు?

ఒక్కసారిగా మంత్రికి Shock. ఎంతయినా ధనం ధనమే. నెమ్మదిగా కాళ్ళ బేరానికి వచ్చాడు. సర్లే ౫౦% అన్నాను. ఒప్పుకున్నాడు. ఎంతయినా చపల బుద్ది కదా.

వెంటనే డబ్బు ఇవ్వను కాదు కాబట్టి బయలుదేరి వెళ్ళి పోయాడు.
మళ్ళీ మిగిలిన వారు ఎందుకు వచ్చారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటే ఈ చెత్త ఉపకరణం మళ్ళీ శక్తి పోయింది.
దీన్ని తిరిగి మళ్ళీ శక్తి పుంజుకోవడానికి Charging లో పెట్టాను.
అప్పుడే ఒక Police వచ్చాడు. ఆ చపల బుద్ది మంత్రి నామీద Case పెట్టాడంట.
(సశేషం..)