ఎనిమిది తలుపులు ఇరవైయవ్వ భాగం

ఆ మూడవది ఎందుకు చెయ్యాలి అర్ధం కాలేదు కదా, ఆ పూర్తి  Mail

నాకు నేను వ్రాసుకుంటున్న ఒక ఉత్తరం. భరత్ కి నా మీద చాలా కోపం. చిన్నప్పుడే తాత దగ్గరకి పంపించేసానని. వాడు నా దగ్గరకు రావాలని అనుకోవట్లేదు. పైగా భరత్ భార్య కావేరి ఇప్పుడు గర్భవతి తను నిషా దగ్గర ఉండాలి. పైగా వాళ్ళు ఉన్న ప్రదేశంలో మంచి ఆసుపత్రి లేదు. కానీ భరత్ కు ఈ విషయం తెలియకూడదు.

అదే పని చేసాను. ఆ అక్షాంశ రేఖాంశాలకు వెళ్ళాను. అక్కడ కావేరితో పాటు మా నాన్నగారు ప్రకాషు ఉన్నారు. అక్కడ నిషాకూడా ఉంది. నిషాను కావేరిని అక్కడ నుంచీ తీసుకు వచ్చేసాను.

తీసుకుని వెళ్ళి Hospital లో చూపించాను.
అంతా బాగానే ఉంది అన్నారు.

అప్పుడు నీకు ఈ విషయం తెలిసింది.
ఇది ఒక పక్కన ఉంచితే వీళ్ళు వచ్చిన సంగతి మర్చిపోయాను.
ఇంతకీ వీళ్ళు వచ్చింది వచ్చే ఎన్నికల గురుంచి. మనకి జరిగే ఎన్నికలు ౫ సంవత్సరాలకు ఒకసారి, నాలుగు సంవత్సరాలు దోచుకుని అయిదవ సంవత్సరం మంచి చేసాము అని చూపిస్తే చాలు కదా. అందుకే వాళ్ళు వచ్చింది. వచ్చే సంవత్సరం అక్టోబర్ నెలలో ఎన్నికలు. మరి ఇప్పుడు ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలి. అంతా సవ్యంగా జరిపించడానికి నా దగ్గరకు వచ్చారు.

నేను రమ్మన్నాను(అదే నిద్రలో నేను). మంచి పని కదా చేసేద్దాం.

వాళ్ళకి కావలిసినది సకాలంలో వర్షాలు. ప్రజలకి పంటలు చేతికి రావడం. సకాలంలో వర్షాలు రావడానికి సాయం చెయ్యగలను గానీ పంటలు చేతికి వచ్చేలాగా ఎలా చెయ్యగలను, అనే కదా నీ ప్రశ్న.
మనకున్న పరిశ్రమలకు ఒక సంవత్సరం సెలవు ప్రకటించాను, చాలా కాలుష్యం తగ్గుతుంది. మరి వాళ్ళ ఉద్యోగాలు, ఈ నల్లధనం తీసుకు పోయేటప్పుడు నాతో తీసుకు వెళ్ళను కదా. వాళ్ళందరికీ ఉపాధి క్రింద మొక్కలు నాటించి పెంచే పని అప్పగించాను. ఇదంతా చెయ్యడానికి నాలుగు రోజులు పట్టింది. నేను చేస్తున్న పనులకు విన్నీకు చాలా కోపం తెప్పించాయి. నేనా లేకపోతే నిద్రలో ఉన్న నేనా అని తెలుసుకోవాలనుకుంది.

(సశేషం)
మీ Moble ఉచితంగా Recharge చేయించుకోండి...

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.