ఎనిమిది తలుపులు ఇరవైఒకటవ భాగం

౦౪/౧౧/౨౦౩౯(04/11/2039) మధ్యాన్నం నాలుగు గంటలు ప్రాంతంలో చెప్పాను కదా విన్నీ ధ్యానంలో కూర్చుంది.
ధ్యానంలో కూర్చున్నప్పుడు తనకి ఏమి జరుగుతుందో తెలియదు. తనని అలాగే Lab లోకి తీసుకు వచ్చాను. అప్పుడే గుర్తుకు వచ్చింది నీ మరిది అర్జున్ Psychology చదివాడు.

వాడిని ఇక్కడకి తీసుకు వచ్చి ఇప్పుడు నా ప్రశ్నలన్నిటికీ సమాధానం తెచ్చుకోవాలి. మరి ఈ యంత్రం ఉపయొగించవచ్చు కదా అని. అది యంత్రం దానికి హెచ్చుతగ్గులు, దాన్ని ఉపయోగించలేను.

కానీ అర్జున్ ఎక్కడ ఉన్నాడు?
దాని కోసం ఇంతకు ముందు కావేరిని తీసుకు వచ్చినప్పుడు ఉపయోగించిన అక్షాంశ రేఖాంసాలు ఉపయోగించి ఒక  surrogate ని పంపాను.

ఇంత కాలం మారింది నువ్వు ఈ  Surrogates/Cy-bots మాత్రమే ఉపయోగిస్తున్నావు అని నవ్వచ్చు, ఈ ప్రశ్నే నాకు వచ్చింది దాని గురుంచి అన్వేషించాను అప్పుడు తెలిసింది వాటికి నాకు శత్రుత్వం. ఇంచుమించు ౨౦౨౦ లో అనుకుంట, నా మీదకి Robot's Nanobot's పంపించారు. వాటితో ఒక పెద్ద యుద్దమే జరిగిందనుకో. నేను తయారు చేసిన Nanorobot's నాకే వ్యతిరేకంగా పనిచెయ్య సాగాయి, నాతో పనిచేస్తున్న ఒక వ్యక్తి CBI కి పనిచేస్తున్నాడు. అందుకు వాటిని ఉపయోగించడం మానేసి ఒక గదిలో బంధించాను(అదే నిద్రలో నేను).

ఇప్పుడు surrogate ఉపయోగించి నీ భార్యను తీసుకు వచ్చిన అక్షాంశ రేఖాంశాలకు వెళ్ళాను.
అక్కడ తిరిగే వాళ్ళందరూ నేను చంపిన వాళ్ళు. దెయ్యాలు కాదు, అందరూ బ్రతికే ఉన్నారు. అంటే నేను ఎవరినీ చంపలేదా? చంపానా?

 సర్లే అని నీ మరిది గురుంచి అంవేషించడం మొదలు పెట్టాను..
(సశేషం...)

No comments:

Post a Comment

తెలుగులో వ్రాయడానికి http://www.google.com/ime/transliteration/ ఉపయోగించండి.