ఎనిమిది తలుపులు ఇరవైరెండవ భాగం

అక్కడ ఉన్న ఒక్కొక్కరిదీ ఒకో బాధ. వెళ్ళింది నేను కాదు కదా నా Surrogate.
ఒక ప్రత్తి రైతు నా మీద ఉన్న అక్కసు వెళ్ళగక్కాడు.
నేను స్థాపించిన Polyester సంస్థ వల్ల అతని ప్రత్తి ఎవరూ కొనలేదు.
నిజమే మరి కాలం మారింది కదా ఎవరికి వారు Ready Made దుస్తులు కొంటున్నారు, నాకు కావలసింది డబ్బు. మీకు కావలిసింది Brand ఇంకొకడి దగ్గరకి వెళ్ళి నా దగ్గర Adidas T-Shirt, Denim Jeans ఉన్నాయి అయి చెప్పుకోవడానికి ఇష్టపడతారు గానీ, నేను నా దేశ ప్రజలు తయారుచేసిన దుస్తులు కట్టుకున్నాను అనరు కదా.
మరి అతను అక్కడ ఎందుకు ఉన్నాడు.
Surrogate: నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు
ప్రత్తిరైతు: ఒక రోజు నన్ను కాపాడండి ప్రభు అని ఆ దొంగ.... దగ్గరకి వెళ్ళాను, వాడికి ఉన్న పలుకుబడి ఉపయోగించి నాకు ఏమైనా సాయం చెయ్యగలడేమో అని. కానీ వాడి దగ్గరనుంచీ నాకు చిద్కారాలు తప్ప ఏమీ మిగలలేదు. నా అహం చంపుకుని పాహిమాం అంటే నాకు ఇదా శాస్తి అని, ఆ రోజు అతను వెళ్ళే చోటకి చంపడానికి వెళ్ళాను, కానీ నన్ను అయన తండ్రిగారు మహనీయుడు అక్కడి నుంచీ ఇక్కడకి తీసుకు వచ్చారు.
Surrogate: నువ్వు అడగలేదా ఆయనని ఎందుకు తీసుకు వచ్చారు అని.
ప్రత్తిరైతు: అడిగాను, కాలమే సమాధానం చెబుతుంది అని.
Surrogate: అవును అతనినే ఎందుకు అడగాలి అనుకున్నావు?
ప్రత్తిరైతు: ప్రభుత్వమే అతని చేతుల్లో ఉంది.
Surrogate: వాడికి అంత ఉందా.
ప్రత్తిరైతు: ఒక ఉదాహరణ చెబుతాను, అతని మీద CBI inquiry వేయించారు. మరి అతను మాత్రం ఊరుకున్నాడా. తన పత్రికలలో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీద చాలా చాలా వార్తలు వ్రాసి Black mailing మొదలు పెట్టాడు.
Surrogate: మరి ఇంతకూ CBI inquiry ఎంతవరకు వచ్చింది.
ప్రత్తిరైతు: నీకు తెలియదా ఆ CBI inquiry అయిపోయి Report అతని చేతికే వెళ్ళింది అని. అయినా అతని భార్యే కదా inquiry చేసింది.
Surrogate: ఛ, మరి ఇంతకూ ఎవరు అసలు inquiry వేయించింది
ప్రత్తిరైతు: నాకు తెలియదు, నీ వాలకం చూస్తుంటే నువ్వు వాడి మనిషిలాగానే ఉన్నావు, ఇప్పటికే చాలా విషయాలు చెప్పాను వెళ్ళు.
Surrogate: అలా కాదు, నేను కూడా ఆయన వల్ల Lottery లో బాధ పడ్డాను.(నేను చదివిన CBI inquiry లో ఉంది)
ప్రత్తిరైతు: నిజమా, మరి నీకు ఏమీ ముట్టజెప్ప కుండానే పంపెసాడా?
Surrogate: ఇస్తాడా??
ప్రత్తిరైతు: నాకు తెలియదు అయినా నీకు చెప్పను ఇప్పటికే చాలా చెప్పాను.

అలా మళ్ళీ తిరిగి ప్రయాణం మొదలు పెట్టాను(అదే Surrogate).
(సశేషం..)

మనమే కొననప్పుడు ప్రభుత్వం కొని ఏమి చేసుకుంటుంది. ప్రత్తి రైతులు అప్పుల ఊభిలో కూరుకు పోయారు అందం కన్నా కుదిరితే మీరు ఖాదీ దుస్తులు ధరించండి.
ఇది చెబుతున్నాను అని నన్ను గాంధేయ వాది అనుకుంటున్నారా కాదు.
I hate family politics........