ఎనిమిది తలుపులు అయిదవ భాగం

ఈ సామ్రాజ్యం ఎంత వరకు పెరిగింది అంటే, మమ్మల్ని ఎదిరించే వారు చనిపోవడం, మామీద CBI inquiry కూడా వేసేసారు. కానీ CBI inquiry  వేసే దైర్యం ఎవ్వరికీ లేదు. మరి వీటి నుంచీ భయట పడడానికి ఈ సామ్ర్యాజ్యం ఇంకా కొత్త కొత్తవి News channel, ఈ సామ్రాజ్యంకి వ్యతిరేకి ఎవరైనా సరే వాళ్ళమీది అభాండాలు వాళ్ళు తప్పు చేసారు కాబట్టి మా సామ్రాజ్యం గురుంచి ఏమీ మాట్లాడే అధికారం లేదు అని నిరూపించే వాళ్ళం.

అంతా బాగానే జరిగిపోయేది. అందరూ అనుకున్నట్టు మమ్మల్ని ఎవ్వరూ పట్టు కునేవారు కాదు. అప్పుడే కాదు ఇప్పటికీ నువ్వు మీ ఊరులో మంచిగా ఉంటే నిన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అన్నట్టు ఉండేది.

ఊరిలో ఒక నీతి.. ఎవరైనా ఊరు దాటి వెళ్ళాలి అంటే నెల నెలా కొంత సొమ్ము ఇక్కడ జమ చెయ్యాలి, అది ఊరి ప్రజల బాగోగులకు ఉపయోగించి ఊరును తీర్చి దిద్దాలి అనే ఒక వాదం తీసుకు వచ్చాడు, చీకట్లో ఉన్న Black mass.


ఇంతేకాదు, Hacking కొత్త పుంతలు తొక్కింది. ఏదయినా company ఒక product like a Music player, pod, Notebook, Netbook, Computer లాంటివి తయారు చెయ్యాలి అనుకుంటే ఆ Project సమాచారం ఇక్కడికి చేరి వారి కన్నా ముందే ఇక్కడి నుంచీ బయటకి వచ్చేది.

ఇలా  ఒకటేమిటి సామ్రాజ్యం విషపు నాగు పడగ విప్పి నట్టు. దాన్నంతా చూస్తుంటే భయమేసేది. ఇదంతా చేయించేది విన్నీ. తన వెనక ఎవరు ఉన్నారు అని అడిగినా చెప్పేది కాదు. ఒక రోజు నాకు చేస్తున్న తప్పుల నుంచీ బయటపడాలి అనిపించి ఎవ్వరికీ తెలియకుండా వేరే ఊరు వెళ్ళి పోయాను. కొన్ని రోజులకు ఉద్యోగం దొరికింది ఎవ్వరికీ తెలియకుండా చాలా కాలం గడిపాను. కానీ ఒక సంవత్సరం తరువాత తిరిగి ఇంటికి చేరుకున్నాను. నన్ను ఎవరు తీసుకు వెళ్ళారో తెలియదు. ఈ సంవత్సర కాలంలో చాలా జరిగిపోయాయి. అప్పటి నుంచీ Dairy వ్రాసుకోవడం మొదలు పెట్టాను. ఏరోజు ఏమి చేసానో తెలుసుకోవడానికి.

 నువ్వు పుట్టిన రెండు సంవత్సరాలయ్యింది. నాకు నేనుగా బ్రతకాలి అని నిశ్చయం తీసుకున్నాను. అదే విన్నీతో అంటే నవ్వేది. నీకు కావలసింది అందుతుంది కదా అని. నేను దృడంగా నిశ్చయించుకున్నాను, ఈ తతంగంకి అంతు చూడాలి అని. కానీ పారిపొయినా తీసుకు వస్తుంది ఆ Black mass అని ఇక్కడే ఉండ దలుసుకున్నాను. అప్పుడు తట్టింది College కి వెళ్ళి ఎవరైనా దీనిని వ్యతిరేకించేవారు ఉంటారు కదా అని. అక్కడికి వెళ్ళి శిక్షకుడుగా చేరాను. 

అక్కడ ఒక అందమైన అమ్మాయి(ప్రణతి) నాకు వచ్చి I Love You అంది. దిమ్మ తిరిగి పోయింది(అంటే పెళ్ళయిన తరువాత బాగా వ్యయాయం చేసి కొంచం సన్నబడి 8 Pack తెచ్చుకున్నాను). నాకు పెళ్ళి అయ్యింది అన్నా వినేది కాదు. నా వెంట పడేది. 

ఈలోగా ఒక E-Mail భరత్(నిన్ను) కి ప్రాణ గండం అని ఎవరో చంపడానికి ప్రయత్నిసున్నారు అని ....... 
(ఇంకా ఉంది....)
పాత్రలు వారి పుట్టిన రోజులు
గగన్ కుమార్  15 - 06 - 1986 (సూత్రదారి)
విన్నీ - 18 - 08 - 1989 (గగన్ భార్య)
ప్రణతి - 15 - 06 - 1993(college girl)
రావల్ -22 - 01 - 1991(విన్నీ తమ్ముడు)
భరత్  - 18 - 04 - 2011(గగన్ విన్నీ ల కొడుకు)
అర్జున్ - 14 - 05 - 2012(రావల్ కొడుకు - ఇంకా మీకు అతని బార్య పరిచయం కాలేదు)
కావేరి- 14 - 05 - 2012(అర్జున్ కి అక్క - వీళ్ళిద్దరూ కవలలు).
ఇంకా చాలా మంది వస్తారు, వారిలో ఎంతమంది ఉంటారో ఏమో........
ఇదంతా  కల్పితం కాదు జరుగుతున్న వాస్తవాల సమాహారం ........